అత్తారింటికి దారేది సినిమాలో పవణ్ కళ్యాణ్ కు బాసటగా ప్రిన్స్ మహేష్ బాబు అదరగొడితే దానికి ధీటుగా ‘ఎవడు’ సినిమాలో చెర్రీకీ తోడుగా బన్నీ(అల్లు అర్జుణ్) అదరగొట్టాడట. ఈసినిమాకు బన్నీ నే సూపర్ హైలెట్ గా నిలుస్థాడని, సినిమా హిట్టుకు ఆయనే ఓ ప్రధాన కారణం అవుతాడని అంటున్నాడు నిర్మాత దిల్ రాజు. అంతే కాదు బన్నీ పాత్ర టోటల్ సినిమాకే ప్రాణం పోసింది అని చెప్పాడు.

బాబాయ్, అబ్బాయ్ సినిమా పోరులో ఎవరు గెలుస్థారో చూడాలి మరి. నిజానికి  ఈరెండు సినిమాలు పవణ్ కళ్యాణ్, రాంచరణ్ లకు ప్రతిష్టాత్మకమని అందరు భావిస్థుంటే అవి కాస్థా ప్రిన్స్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లుఅర్జుణ్ లకు సవాల్ గా మారాయి. ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’ సినిమాలు నలుగురు స్టార్ల ఇమేజితో ముడిపడిఉండడంతో టాలీవుడ్ వర్గాల దృష్టంతా ఆరెండు సినిమాలపైనే కేంద్రీకృతమైంది.

నిజానికి అత్తగారింటికి విజయం కోసం దారేది అంటూ పవణ్ కళ్యాణ్ వెలుతుంటే ఆయన అత్తగారి లాంటి ఇంటికి చెందిన బన్నీ మామయ్యకు కాకుండా బామ్మర్ధి చెర్రీకి బాసటగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవణ్ సినిమా ఆడియో ఫంక్షణ్ కు కూడా బన్నీ దూరంగా ఉండడం, చెర్రీ కోసం కష్టపడడం చూస్థుంటూ వారంతా పవణ్ ను టార్గెట్ చేసుకున్నారా... అంటూ గుసగుసలు కూడా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్థున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: