దగ్గుబాటి రానా హీరోగా తేజ డైరక్షన్ లో వచ్చిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. మూడు సినిమాల ట్ర‌యాంగిల్ ఫైట్‌లో గ‌త శుక్ర‌వారం రిలీజ్ అయిన ఈ సినిమా మూడు సినిమాల కంటే ఎక్కువ వ‌సూళ్ల‌తో ఫ‌స్ట్ వీక్‌లో పైచేయి  సాధించి తానే బాక్సాఫీస్ రాజున‌ని నిరూపించుకుంది.

nene raju nene mantri hd కోసం చిత్ర ఫలితం

సాధారణ వడ్డీ వ్యాపారి సీఎంగా పోటీ చేసే రేంజ్‌కు వెళితే ఎలా ఉంటుంద‌న్న క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమాలో జోగేంద్ర‌గా రానా, రాధ‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించారు. లై, జ‌య జాన‌కి నాయ‌క సినిమాల‌తో పోలిస్తే తొలి రోజు నుంచే ఆధిప‌త్యం చెలాయించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద విన్న‌ర్‌గా నిల‌బ‌డింది. 


బాహుబలి తర్వాత రానా చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రానాకు సోలోగా మంచి హిట్ కూడా వ‌చ్చింది. ఇక ప‌దేళ్లుగా వ‌రుస ప్లాప్ సినిమాలు చేస్తున్న తేజ ఈ సినిమాతో ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చాడు. 

nene raju nene mantri hd కోసం చిత్ర ఫలితం

' నేనే రాజు నేనే మంత్రి ' ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ :

నైజాం - 6.04 కోట్లు
సీడెడ్ - 2.10 కోట్లు
వైజాగ్ - 1.95 కోట్లు
గుంటూరు - 1.16 కోట్లు
కృష్ణ - 1.15 కోట్లు
ఈస్ట్ - 1.38 కోట్లు
వెస్ట్ - 72 లక్షలు
నెల్లూరు - 46 లక్షలు
-------------------------------------
ఏపీ+తెలంగాణ = 14.96 కోట్లు
--------------------------------------
రెస్టాఫ్ ఇండియా - 1.25 కోట్లు
ఓవ‌ర్సీస్ - 80 ల‌క్ష‌లు
----------------------------------------------------
ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ = 18.01 కోట్లు
----------------------------------------------------

nene raju nene mantri hd కోసం చిత్ర ఫలితం


మరింత సమాచారం తెలుసుకోండి: