పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఇన్నేళ్లుగా స్నేహం చేసిన శరత్ మరార్ సడెన్ గా ఆయన నుండి దూరం వెళ్లాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. ఎన్నో ఏళ్లుగా స్నేహంగా ఉంటుంది ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు డిస్టన్స్ బాగా వచ్చిందట. పవన్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే క్రమంలో శరత్ మరార్ తన నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలను తీశాడు.


ఆ సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు సినిమాలు శరత్ మరార్ కు పెద్ద దెబ్బే వేశాయట. అదికాక సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ గొడవ చేయడంతో అప్పుడు కూడా పవన్ సైలెన్స్ ను శరత్ జీర్ణించుకోలేకపోయాడట. అందుకే తనకు తానుగా పవన్ నుండి దూరంగా వెళ్లాడనేది ఫిల్మ్ నగర్ టాక్.


ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అన్నది తెలియట్లేదు కాని దాదాపు పవన్ తో శరత్ వ్యవహారం మొత్తం చెడినట్టుగా తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికొస్తే పవన్ త్రివిక్రం మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత పవన్ సంతోష్ శ్రీనివాస్ సినిమా చేయనున్నాడు.


పవన్ తో ఫ్లాపులను అందుకున్న శరత్ మరార్ ఈసారి మీడియం బడ్జెట్ మూవీస్ తో సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ప్రస్తుత సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడట. మొత్తానికి పవన్ తో శరత్ స్నేహం బ్రేకప్ పై వస్తున్న ఈ వార్తల్లో అసలు నిజం ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: