నందమూరి నారా కుటుంబాల ముద్దుల మనవడు దేవాన్ష్  ‘పైసా వసూల్’ సినిమా షూటింగ్ లో చేసిన హంగామా తాలూకు వివరాలలు ఆలస్యంగా వెలుగు లోకి వచ్చాయి.  ఈ సినిమాకు సంబంధించి ఒక మాస్ సాంగ్ ను  హైదరాబాద్ లో షూట్ చేస్తున్న సమయంలో ఆ షూటింగ్ ను చూడటానికి దేవాన్ష్ తన తాత బాలకృష్ణతో షూటింగ్ స్పాట్ కు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆ పాట షూటింగ్ కు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ఇప్పుడు బాలయ్య అభిమానుల కోసం ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాకు లీక్ చేసారు.  ఆ స్టిల్స్ లో బాలకృష్ణ మనవడు దేవాన్ష్ కనిపించే రెండు స్టిల్స్ కూడా వున్నాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా సందడి చేస్తున్నాయి.

 షూటింగ్ ను ఎంజాయ్ చేస్తున్న దేవాన్ష్ అలాగే దేవాన్ష్ చేష్టలను చూసి మురిసిపోతున్న బాలయ్య,  మరియు ఆమూవీ యూనిట్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన మనవడి హడావిడి చూసి మురిసిపోతున్న బాలయ్య ఆనందానికి సంబంధించిన ఈ ఫోటోలను బాలకృష్ణ అభిమానులు లైక్ లు కొడుతూ ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. 

ఇది ఇలా ఉండగా ఈ మూవీ పాటలు విడుదలఅయ్యాక బాలయ్య ఫ్యాన్స్ తో పాటు యూత్ కుడా ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమా పాటలు  విని గుంటూరు దగ్గరలోని కేఎల్ యూనివర్శిటీ హాస్టల్లో యూత్ చేసిన హడావిడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనితో ‘పైసా వసూల్’ ఫీవర్ యూత్ లో మొదలైందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: