ప్రస్తుతం అల్లరి నరేశ్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో అతడితో సినిమాలు తీయడానికి ఏదర్శక నిర్మాతలు ఆసక్తి కనపరచడంలేదు. ఎప్పుడో ఐదేళ్ల కిందట ‘సుడిగాడు’ తో బిగ్గెస్ట్ హిట్  కొట్టిన అల్లరి నరేశ్ ఆతరువాత ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఏప్రయత్నం కలిసిరాలేదు. గడచిన  ఐదేళ్లుగా నరేష్  దాదాపు 10 సినిమాలలో నటించినా ఏ సినిమా కూడ కనీసపు విజయాన్ని అందుకోలేకబోయాయి. 

ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలు ఫ్లాపైనా సేఫ్ జోన్లోనే ఉండేవి. కానీ తర్వాత అతడి మార్కెట్ బాగా దెబ్బతిని  ఓపెనింగ్స్ కూడా  రాకపోవడంతో ఘోరమైన ఫలితాన్ని చూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాగా గ్యాప్ తీసుకుని మళ్ళీ అల్లరోడు చేస్తున్న ప్రయోగం ‘మేడ మీద అబ్బాయి’

మలయాళంలో సూపర్ హిట్టయిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ సినిమాకు రీమేక్‌ గా  ఏ సినిమాను తీస్తున్నారు గత కొన్నేళ్లలో అల్లరోడి సినిమాలు ఫ్లాపవడానికి ప్రధాన కారణం అవన్నీ ఒక మూసలో ఉండటం అనే కామెంట్స్ ఉన్నాయి.  అయితే ఇప్పుడు ఈ హీరో చేసిన ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది   

ఈ సినిమా కొన్నాళ్ల కిందటే పూర్తి అయినా ఎటువంటి పోటీలేని మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఇప్పడు అనుహ్యంగా ఈమూవీని సెప్టెంబరు 8న విడుదల కోసం ముహూర్తం ఫిక్స్ చేశారు.  అయితే ఇప్పటికే నాగచైతన్య  ‘యుద్ధం శరణం’  ఈడేట్ ను ఖారారు చేసుకుంది దేనికితోడు మంచు మనోజ్ సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ కూడా ఆ రోజే రిలీజ్ అంటున్నారు. 

ఇలా ఆ రెండు సినిమాలు తమ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాక కూడా అల్లరోడి సినిమాను అదేరోజుకు షెడ్యూల్ చేయడం ఎవరికీ అర్ధం కాని విషయంగా మారింది. దీనితో ఇంతటి సాహసం ఈ అల్లరోడు ఎందుకు చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: