మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తొ వస్తున్న సంగతి తెలిసిందే. 150 ఏళ్ల క్రితం జరిగిన ఈ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు.


సైరా నరసింహారెడ్డి.. మెగా ఫ్యాన్స్ అందరికి రోమాలు నిక్కబొడుకునేలా ఉంది ఈ టైటిల్.. ముఖ్యంగా రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మోషన్ పొస్టర్ కే ప్రాణం పోసింది. చిరు లుక్ రివీల్ చేయలేదు. కాని సినిమా మాత్రం విజువల్ గ్రాండియర్ గా ఉండబోతుందని మోషన్ పోస్టర్ తోనే చెప్పేశారు.


సినిమా మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన సైరా నరసింహారెడ్డి చిరు సినిమాల్లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు. రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ హింది భాషల్లో తెరకెక్కుతుంది. సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ అవుతుంది. 


ఇక సినిమా పోస్టర్ గ్రాండియర్ చూసాక తప్పకుండా ఇది మరో బాహుబలి అవుతుందని అనిపిస్తుంది.. పోస్టర్ తో సినిమా మీద అంచనాలను పెంచిన సురేందర్ రెడ్డి కచ్చితంగా బాహుబలి స్పూర్తితో అదే రేంజ్ సినిమా అందిస్తాడని ఆశిద్దాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: