స‌రైనోడు లాంటి ఊర‌మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను డైరెక్ట్ చేసిన సినిమా జ‌య జాన‌కి నాయ‌క‌. యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన ఈ సినిమా ఈ నెల 11న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మూడు సినిమాల మధ్య ట‌ఫ్ కాంపిటేష‌న్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్లు దున్నేస్తోంది.

jaya janaki nayaka apherald కోసం చిత్ర ఫలితం

10 రోజులు కంప్లీట్ చేసుకున్న జ‌య జాన‌కి నాయ‌క 10 రోజుల‌కు ఏపీ, తెలంగాణ‌లో రూ 17.25 కోట్ల షేర్ రాబ‌ట్టింది. మిర్యాల ర‌వీంద్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిచాడు. రిషీ పంజాబి సినిమాటోగ్ర‌ఫీ కూడా హైలెట్ అయ్యింది. సినిమా నిండా భారీ కాస్టింగ్ ఉండ‌డంతో పాటు క‌థ‌, క‌థ‌నాలు మాస్ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ కావ‌డంతో రెండో వారంలో జ‌య జాన‌కి నాయ‌క బాగా పుంజుకుంది.రెండో వారంలో ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ‌లో 100 స్క్రీన్లు పెర‌గ‌డం విశేషం.

జ‌య జాన‌కి నాయ‌క 10 డేస్ ఏరియా వైజ్ షేర్ డీటైల్స్ ఇలా ఉన్నాయి. 
నైజాం - 5.28 కోట్లు
సీడెడ్ - 3.45 కోట్లు
ఉత్త‌రాంధ్ర - 2.51 కోట్లు
గుంటూరు - 1.53 కోట్లు
ఈస్ట్ - 1.36 కోట్లు
వెస్ట్ - 1.18 కోట్లు
కృష్ణా - 1.10 కోట్లు
నెల్లూరు - 0.84 కోట్లు
------------------------------------
ఏపీ + తెలంగాణ : 17.25 కోట్లు
------------------------------------

jaya janaki nayaka apherald కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: