‘సైరా’ ‘నరసింహా రెడ్డి’ ఫస్ట్ లుక్ మోషన్ పోష్టర్ కు విపరీతమైన స్పందన వస్తోంది. అనేకమంది ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈసినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

ఈవిషయంలో ఉన్న వాస్తవాలు ఎన్నో తెలియకపోయినా ప్రస్తుతం ఈ హాట్ గాసిప్ ఫిలింనగర్ లో షేక్ చేస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు థమన్ నే మ్యూజిక్ డైరక్టర్ గా ఉంటే బావుంటుందని డైరక్టర్ సురేందర్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ సినిమాకు పెరిగిపోయిన బడ్జెట్ రీత్యా ఈసినిమాకు భారీ స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేయడానికి మెగా కాంపౌండ్ రీత్యా రెహమాన్ కే ఓటు వేసినట్లు టాక్. ఈ విషయంలో రెహమాన్ తో డిస్కషన్ల కోసం సురేందర్ రెడ్డి విదేశానికి కూడా వెళ్లి వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. 

ఇది ఇలా ఉండగా నిన్న చిరంజీవి పుట్టినరోజునాడు విడుదలైన ఈ మోషన్ పోస్టర్ కు మాత్రం ఎస్ ఎస్ థమన్ రీరికార్డింగ్ చేసినట్లు తెలుస్తోంది. రెహమాన్ కు కుదరక పోవడం వలనో లేక  అందుబాటులోకి రాకపోవడం వల్లనో ఈ కార్యక్రమం థమన్ కు అప్పచేప్పారని తెలుస్తోంది. దీనితో థమన్ తన పనులన్నీ పక్కకు పెట్టి ఈ మోషన్ పోస్టర్ పైనే పని చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల గాసిప్.

అయితే థమన్ కు పంపిన మోషన్ పోస్టర్ డిజైన్ లో సంగీతం ఎవరు అన్నది లేదని కూడా తెలుస్తోంది. దాంతో ఈ మోషన్ పోస్టర్ బాగా చేస్తే, తనకు చాన్స్ వస్తుందని థమన్ ఎంతో శ్రద్ధగా ఈపని పూర్తి చేసినా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తరువాత  ఈ ఫస్ట్ లుక్ పోష్టర్ లో చివరకు క్లైమాక్స్ గా రెహమాన్ పేరు చేర్చినట్లు గాసిప్పుల హడావిడి చేస్తున్నాయి. దీనితో ఈసినిమా తనకే వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న థమన్ కు నిరాశ ఎదురైందని గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: