మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో రాబోతుందని తెలిసిందే. సినిమా టైటిల్ లుక్ మోషన్ పోస్టర్ ను నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. 


దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇది నాకు చాలా గర్వంగా ఉందని.. పర్ఫెక్ట్ కాస్ట్ అండ్ క్రూతో సినిమా వస్తుందని సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినందుకు గర్వపడుతున్నా అని టీం అంతటికి బెస్ట్ విసెష్ తెలియచేశారు రాజమౌళి. ఇక జక్కన్న రిలీజ్ చేశాడని కాదు కాని సినిమా టైటిల్ లోగో మాత్రం అదుర్స్ అని చెప్పాలి. 


బాహుబలి తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో పెను సంచలనాలే ఏర్పడ్డాయి. సినిమాను సాధ్యమైనంత వరకు భారీతనంతో తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాహుబలికి ఏమాత్రం తగ్గని విధంగా సై రా నరసింహారెడ్డి ఉండబోతుందని పోస్టర్ తోనే రుచి చూపించాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ నటిస్తుండటం విశేషం. 


కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా తెలుగు తమిళ హింది భాషల్లో తెరకెక్కుతుంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఎలాంటి ప్రభజనాలు సృష్టిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: