తెలుగు ఇండస్ట్రీలో నాని హీరోగా నటించిన ‘ఎవడే సుబ్రమాణ్యం’ చిత్రంతో మంచి మార్కులు కొట్టిన సహ నటుడు దేవరకొండ విజయ్ ఆ తర్వాత వచ్చిన ‘పెళ్లిచూపులు’ చిత్రంతో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  తర్వాత వచ్చిన ద్వారక చిత్రం కూడా పరవాలేదు అనిపించింది.  తాజాగా దేవరకొండ విజయ్ నటిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో ఓ పోస్టర్ పై వచ్చిన వివాదం రచ్చ రచ్చ చేసాంది. 

Image result for arjun reddy posters

ఆ పోస్టర్ లో హీరో, హీరోయిన్లు లిప్ లాక్ ఉండటంపై ఆ మద్య తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు బహిరంగంగా విమర్శిస్తూ..పోస్టర్ కూడా చింపివేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇలాంటి పోస్టర్ల వల్ల యువత పెడదారి పట్టేలా ఉన్నాయని..ఇలాంటి పోస్టర్లను ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయవొద్దని అన్నారు.  ఇక సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనదైన స్టైల్లో విమర్శించారు. 

Image result for arjun reddy posters

అంతే కాదు  ఈ పోస్టర్ పై పోలీసులకు ఫిర్యాదులు అందటంతో.. సినిమాలోని లిప్ లాక్ లకు సంబంధించిన పోస్టర్లను ఉపసంహరించుకున్నట్టు దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా తెలిపారు. మహిళలను గౌరవిస్తూ ఏపీ, తెలంగాణాల్లో ఏర్పాటు చేసిన ఈ సినిమా పోస్టర్లను తీసేసినట్టు తెలిపారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: