తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ.  గత కొంత కాలంగా ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలకృష్ణ తన వందవ చిత్రం క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ నటించి అందరిచేత షబాష్ అనిపించుకున్నారు.  

ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్ ’ చిత్రంలో నటిస్తున్నారు.   ఈ మద్య చిన్న హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు రిమేక్ సాంగ్స్ తో అదరగొడుతన్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య, పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్న " పైసా వసూల్ " చిత్రంలో నాటి జీవిత చక్రం మూవీలో ఎన్టీఆర్, వాణిశ్రీలపై చిత్రీకరించిన " కంటి చూపు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది ఓ పిల్లా " పాటను రీ-మిక్స్ చేసి బాలకృష్ణ, ముస్కాన్‌ సేథీలపై షూట్ చేశారు.  

ఈ పాటలో బాలకృష్ణ తన తండ్రి మాదిరిగా కాస్ట్యూమ్స్ ధరించి స్టెప్పులు కూడా అలాగే వేయడం చూస్తుంటే నిజంగా ఎన్టీఆర్ డ్యాన్స్ చేసినట్లు అనిపించింది.  పైసా వసూల్ మూవీ యూనిట్ ఈ సాంగ్ వీడియోని రిలీజ్ చేసింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్.. బాలయ్యా..మజాకా అన్నట్టు న్న ఈ పాటలో ఆయన స్టెప్పులు, యాక్టింగ్ చూస్తుంటే సినిమా అటు మాస్..ఇటు క్లాస్ గా మెప్పిస్తారని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: