సినిమాలు అంటే ఇష్టపడిన వారు ఎవరూ ఉండరు..ఇక సినిమా లో చాన్స్ వచ్చిందంటే పండగే. అయితే ఈ మద్య కొంత మంది యువతీ, యువకులను సినిమా పేరు చెప్పి దారుణంగా మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. రీసెంట్ గా ఓ యువతిని సినిమా షూటింగ్ కోసం అని చెప్పి దర్శకులు, హీరో ఆమెపై అత్యాచారం చేయడానికి పూనుకున్న విషయం తెలిసిందే.  

Image result for hitech prostitution

ఈ మద్య కొంత మంది డబ్బు సంపాదించే క్రమంలో అక్రమదందాలు విచ్చల విడిగా చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే..జూదం, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ దందా లు చేస్తూ యువతను ఆకర్షిస్తున్నారు.  ఈ దందాలు నడుపుతున్న కొంత మందికి రాజకీయ,పోలీసు అండదండలు ఉండటంతో వారి వ్యాపారాలు మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగుతుంది.  అయితే కాలం ఎప్పటికీ ఒకేలా ఉండదు..చట్టం తన పని తాను చేసుకు పోతుందని మరోసారి నిరూపించారు పోలీసులు.  
Image result for hitech prostitution
ఢిల్లీలోని డేరామండీ ప్రాంతంలో ఉన్న 13 ఎకరాల లగ్జరీ ఫామ్ హౌస్ అది. అక్కడో క్యాసినో బార్ ఉంది.  అయితే గత కొంత కాలంగా అక్కడ చిన్న సినిమాల షూటింగ్ జరుగుతున్నాయని ప్రచారం కొనసాగుతూ వచ్చింది..అంతే కాదు అక్కడికి సామాన్య పౌరులు ఎవరూ కూడా చేరుకోలేరు. ఎందుకంటే అక్కడ బస చేయాలంటే..చాలా సంపన్నులై ఉండాలి.  
Image result for hitech prostitution
లిక్కర్, హుక్కాలతో పాటు జూదం ఆడేందుకు అవసరమయ్యే కాయిన్స్ ఇక్కడ కోకొల్లలు. వాస్తవానికి సినిమా షూటింగ్ అనేది ఉత్తుత్తి మాటలే..అసలు వ్యవహారాలు వేరుగా ఉంటాయి.  అందమైన యువతులతో హైటెక్ వ్యభిచారం చేయిస్తూ సంపన్నుల నుంచి అందినంత దోచుకుంటున్నారు అక్కడి నిర్వాహకులు.
Image result for hitech prostitution
విషయం తెలుసుకున్న పోలీసులు ఈ చీకటి దందాను బట్టబయలు చేశారు. జూదం ఆడుతున్న 14 మంది, ఐదుగురు యువతులు పట్టుబడ్డారు. లక్షల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్ కూడా లభించాయి. డేరామండీలో రహస్యంగా నిర్వహిస్తున్న క్యాసినో నిర్వాహకులపైనా కేసులు పెట్టామని పోలీసు అధికారులు తెలిపారు. మొత్తానికి సినిమా షూటింగ్ ముసుగులో జరుగుతున్న కొత్త దందా చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: