బాయ్స్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన భరత్ ఆ తర్వాత  ‘ప్రేమిస్తే’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  తర్వాత వచ్చిన  ‘యువసేన’ చిత్రంలో నటించినా భరత్ కి పెద్ద పేరు మాత్రం రాలేదు.  ఆ తర్వాత్ తమిళ, మళియాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  తాజాగా రామారీల్స్‌ పతాకంపై జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మాతగా 'ప్రేమిస్తే' భరత్‌, రుహాని శర్మ, అంగనా రారు హీరో, హీరోయి న్లుగా నటిస్తున్న చిత్రం 'మళ్ళీ ప్రేమిస్తే'.  

ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ నెలలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.  ప్రేమిస్తే లాంటి అద్భుతమైన ప్రేమ కథా చిత్రంలో భరత్ ఏ రేంజ్ లో నటించాడో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే తరహా మరో ప్రేమ కథా చిత్రమే మళ్లీ ప్రేమిస్తా..అయితే ఈ చిత్రంలో తనను ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే భరత్‌ పడ్డ వేదనను ఆకట్టుకునేలా దర్శకుడు చిత్రీకరించారు.  

విజరు కురకాల సంగీత దర్శకత్వంలో ఐదు పాటలను రూపుదిద్దారు. 'ప్రేమిస్తే' చిత్రం తర్వాత ఈ చిత్రం అంత ఘన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముజీజ్‌ మాలిక్‌, ఎడిటింగ్‌: నందమూరి హరిబాబు, సహ నిర్మాత: కిరణ్‌ తనమాల, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: రవి భార్గవన్‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: