ఆమె పుట్టింది ఈదేశంలో కాదు, నేపాల్ లో పుట్టిన ఈ బ్యూటీ కొన్ని సంవత్సరాల పాటు బాలీవుడ్ సినిమాలలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో కూడా నాగార్జున లాంటి వెండితెర మన్మధుడితో ‘క్రిమినల్’ సినిమాలో నటించి, అలనాటి యువతరానికి క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆమె ఎవరో ఈపాటికే మీకు అర్ధం అయిపోయిఉంటుంది. ఆమే మనీషా కోయిరాలా. ‘బొంబాయి, 1942 లవ్ స్టొరీ, దిల్ సే’ లాంటి బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలలో నటించి, తరువాత కొన్ని ప్రేమ వ్యవహారాల వల్ల తెరమరుగు అయిన మనీషా, తను ప్రేమించిన వ్యక్తి ప్రేమలో ఓడిపోయినా, తనపై దాడి చేసిన కాన్సర్ వ్యాధితో పోరాడి గెలిచింది. అమెరికాలో గర్భాశయ కాన్సర్ కు ఆపరేషన్ చేయి౦చుకొని నిన్న సాయంత్రం తిరిగి వచ్చిన మనీషా కోయిరాలా, తన లేటెస్ట్ ఫోటోలను ట్విట్ చేసింది. ఒకనాటి అందాల తార ఇలా మారిపొయి౦దా..? అనే సందేహం ఈ ఫోటోలను చూసిన వారికి కలుగుతుంది.

నున్నటి గుండు తో ఎటువంటి అనారోగ్య చిహ్నాలు కనిపించకుండా, నవ్వుతూ ఉన్న ఆమె ఫోటోలను చూస్తే ఆమె ఒకనాటి మనీషా యేనా..? అనే ఆశ్చర్యం కలగకమానదు. ప్రస్తుతం తన ద్రుష్టి ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన వైపు ఉందని, దేవుడిని నమ్ముకుంటే ఎవరికైనా ఎటువంటి కష్టాలు ఉండవని చెపుతున్న మనీషా ఒప్పుకుంటే ఇప్పటికీ ఆమెతో సినిమాలు తియ్యడానికి రెడీ అని చెపుతున్న నిర్మాతలు బాలీవుడ్ లో ఉన్నారు అని తెలిస్తే మనీషా కు ఇప్పటికీ ఇంత పాపులారిటీ ఉందా..? అని అనిపిస్తోంది. అతి క్లిష్టమైన గర్భాశయ కాన్సర్ ను జయించిన మనీషా, తాను కోరుకుంటున్న ఆధ్యాత్మిక రంగంలో రాణించాలని ఆశిద్దాం.....
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: