గత కొన్ని రోజులుగా తెలుగు బుల్లితెరపై వస్తున్న రియాల్టీ షో ‘బిగ్ బాస్’ మొదట్లో కాస్త బోర్ కొట్టినా రాను రాను ఆసక్తి రేపుతుంది.  ప్రతిరోజు బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న వారికి బిగ్ బాస్ చిత్ర విచిత్రమైన టాస్క్ లు ఇవ్వడం వాటిలో కొన్ని కూల్ అయితే..కొన్ని కాంట్రవర్సీలు కావడం చూస్తుంటే ప్రేక్షకులకు బిగ్ బాస్ పై క్యూరియాసిటి పెరుగుతుంది.   ఆ మద్య బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అనుకోకుండా బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లి పోగానే అతని ప్లేస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది దీక్షా పంత్. అయితే దీక్షా పంత్ ని సారీ చెప్పే నేపంతో ప్రిన్స్ ముద్దు పెట్టుకోవడం సెన్సేషన్ అయ్యింది. 

Image result for telugu bigg boss house

ఇక శని,ఆదివారాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.  అయితే ఎలిమినేట్ అయిన వారు బిగ్ బాంబ్ వేయడం ఆనవాయితీ..ఈ సారి కత్తి కార్తిక వేసిన బిగ్ బాంబ్ కి బలైంది..శివబాలాజి.  దీని ప్రకారం ఉదయాన్నే నిద్ర లేచిన తరవాత అందరూ బాత్‌రూమ్‌కు వెళ్లొచ్చాకే ఆఖరిలో శివ బాలాజీ వెళ్లాలి. దీనిపై సోమవారం హౌజ్‌మేట్స్ మధ్య కాస్త సరదా వాతావరణం నెలకొంది.

ఇక  ముమైత్ ఖాన్ వెరైటీ గెటప్‌తో హౌజ్‌మేట్స్‌కి ముద్దులివ్వడం మొదలుపెట్టింది. నల్లటి రంగుతో మీసాలు రుద్దుకుని, నుదుటికి నిలువుగా ఎర్రటి బొట్టుపెట్టుకుని హౌజ్‌లో తిరిగింది.ఈ క్రమంలో మొదట దీక్షపై ముద్దుల వర్షం కురిపించింది.  ఆ తర్వాత నవదీప్ దగ్గరకు వచ్చి ముద్దు ఇచ్చి వెళ్లి మళ్లీ వచ్చి మరోసారి డీప్ కిస్సులు ఇచ్చేసింది.  

ఇది చూసిన బిగ్ బాస్ హౌజ్ మెంట్స్ అందరూ ఆశ్చర్యపోయారు.  కాకపోతే ముమైత్ కి ఇలాంటివి కామన్ అని సర్ధుకున్నారు.  తర్వాత బిగ్ బాస్ హరితేజ, శివ బాలాజీలను బిగ్‌ బాస్ కన్ఫెషన్ రూంలోకి పిలిచారు. అక్కడ వీరిద్దరికీ ఒక యాక్టివిటీని బిగ్ బాస్ వీరికి అప్పగించారు. అదేంటంటే.. హరితేజ కోతి, ఆ కోతి ఆడించేవాడు శివ బాలాజీ.  
Image result for telugu bigg boss house
తన దగ్గర ఉన్న కోతిని ఆడిపిస్తూ దానికి లాలీపాప్, అరటిపళ్లు, చాక్టెట్లు ఇవ్వొచ్చని సూచించారు. బిగ్ బాస్క్ ఇచ్చిన టాస్క్‌ను హౌజ్‌మేట్స్‌కి చెప్పకుండా సరదాగా హరితేజ, శివ బాలాజీ చేసుకుంటూ పోయారు.ఈ సారి ఎలిమినేషన్ నవదీప్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, అర్చన, దీక్ష నామినేట్ అయినట్లు బిగ్ బాస్ చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: