అత్తారింటికి దారేది మూవీ రిలీజ్‌ త్వర‌లోనే ఉండ‌టంతో ఆ హీట్ నుండి కాస్త రిలీఫ్ కావ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫారిన్ ట్రిప్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప‌వ‌న్ త‌న ప్రతి మూవీ రిలీజ్ రోజున‌ ఫారిన్‌లో గ‌డుపుతుంటాడు. అలాగే ఈ సారి కూడ ప‌వ‌న్ ఫారిన్ టూర్ ఖాయ‌మ‌వుతుంద‌నే టాలీవుడ్ ఇండ‌స్ట్రీ చెబుతుంది.

అబ్బాయ్ రామ్‌చ‌ర‌ణ్ మూవీ రిలీజ్ అయిన స‌రిగ్గా వారం రోజుల‌కే ప‌వ‌న్ మూవీ రిలీజ్ అవుతుంది. ఎవ‌డు మూవీ థియోట‌ర్లు లిస్టు ఇప్పటికే ఖారారైంది. కాని అత్తారింటికిదారేది మూవీకు మాత్రం థియోట‌ర్ల క‌న్‌ప్యూజ‌న్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఆంద్రా,సీడెడ్ ఏరియాల్లో ప‌వ‌న్ మూవీకు థియోట‌ర్లు లెక్క తేలినా, ఒక్క నైజాం ఏరియాలోనే ప‌వ‌ర్‌స్టార్‌కు గ‌డ్డు ప‌రిస్థితి ఎదురుకావ‌చ్చు అంటున్నారు. నైజాం ఏరియాకు సంబంధించి దిల్‌రాజు చేతిలో ఎక్కువ‌ థియోట‌ర్లు ఉండ‌టంతో, ఆ థియోట‌ర్లలో ఎవ‌డు మూవీను క‌నీసం 15 రోజులైన ఉంచాల‌నుకుంటున్నాడు.

దాంతో ప‌వ‌న్ మూవీకు థియోట‌ర్ల కొర‌త త‌ప్పటం లేదు. నైజాం రైట్స్‌ను అత్యధిక మొత్తంగా 13 కోట్లకు కొన్న నితిన్‌కి, థియోట‌ర్ల కొర‌త‌లేకుండా చేసేందుకు ప‌వ‌న్ రంగంలో దిగాడ‌ని స‌మాచారం. నితిన్‌ను థియోట‌ర్ స‌మ‌స్యల నుండి బ‌య‌ట‌ప‌డేశాకే ప‌వ‌న్ ఫారిన్ టూర్ వెళ‌తాడ‌ని టాలీవుడ్ అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: