ఒక్క హిట్టు జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. చిత్ర‌సీమ‌లో అది నిజం కూడా. ఒక్క విజ‌యంతో తారాప‌థంలోకి వెళ్లిపోయిన వాళ్లు ఉన్నారు. ఇక వారి ప‌ని అయిపోయింది అనుకొన్న‌వాళ్లు మళ్లీ ఓ విజ‌యంతో దూసుకుపోయిన దాఖ‌లాలు కూడా మ‌న‌కున్నాయి. అయితే ర‌వితేజ విష‌యంలో ఇది రివ‌ర్స్ అయ్యింది.

బ‌లుపుతో ఓ చ‌క్క‌ని క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం సొంతం చేసుకొన్నాడు ర‌వితేజ‌. మాస్ మ‌హారాజాని స‌రిగ్గా పిండుకొంటే హిట్టు గ్యారెంటీ అని ఈ సినిమా నిరూపించింది. కానీ ఈ సినిమా వ‌ల్ల ర‌వితేజ‌కు ఒరిగిందేం లేదు. కొత్తగా ర‌వితేజ ఇమేజ్ పెరిగిందేం లేదు. ఇంత‌కు ముందు ర‌వితేజ ఆఫీసు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడిపోయేది. ఇప్పుడు ఆ వైభ‌వం లేదు. వీర‌, నిప్పు, దొంగల ముఠా, ద‌రువు, దేవుడు చేసిన మ‌నుషులు ఇలా వ‌రుస ప‌రాభ‌వాలే అందుకు కార‌ణం.

బ‌లుపు హిట్‌తో పోయిన క్రేజ్ తిరిగి సంపాదిద్దాం అనుకొన్నా అది సాధ్య ప‌డ‌లేదు. పెద్ద ద‌ర్శ‌కులెవ‌రూ ర‌వితేజ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు అనేది వాస్త‌వం. బ‌లుపు లాంటి మ‌రో హిట్ ప‌డితే గానీ ర‌వితేజ కెరీర్ గాడిలో ప‌డ‌దు. ఆ హిట్టు రావాలంటే... ఇంకో సినిమా మొద‌ల‌వ్వాలి క‌దా? ఏదీ? ఆ సినిమా???

మరింత సమాచారం తెలుసుకోండి: