చిన్న సినిమా పేరు చెప్పి... బూతు సినిమాలు వ‌దులుతున్నారీమ‌ధ్య‌. అదేమిటంటే మారుతి మార్క్ అంటున్నారు. బ‌స్‌స్టాప్‌, రొమాంటిక్ క్రైమ్ క‌థ‌. త్రీజీల‌వ్ ఈ బాప‌తు సినిమాలే. ఇప్పుడు ఇంకో సినిమా వ‌స్తోంది.. అదే రొమాన్స్‌.

డార్లింగ్ స్వామి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా అవ‌తారం ఎత్తుతున్నాడు. ఈ సినిమా వెనుక మారుతి హ‌స్తం కూడా ఉందండోయ్‌. ఎందుకంటే ఈ చిత్రానికి ఆయ‌నే నిర్మాత‌. డ‌బ్బులు పెట్టిన‌ప్పుడు త‌గిన జాగ్ర‌త్తలు కూడా తీసుకొంటాడు క‌దా..? అందుకే త‌న‌దైన శైలిలో మ‌సాలా, బూతు జోకులు ద‌ట్టించాడ‌ట‌. దాంతో ఈ సినిమాలో ఘూటు ఎక్కువైంద‌ని టాక్‌.

సెన్సార్ ముందుకు వెళ్లేముందు.. ఓసారి స్వీయ సెన్సార్ చేసుకొందామ‌ని చిత్ర బృందం సినిమా వేసుకొని చూసుకొంద‌ట‌. బూతుని క‌త్తిరిస్తే సినిమాలో శుభం కార్డు మిన‌హా మ‌రేం మిగ‌ల‌ద‌ని భ‌య‌ప‌డుతున్నారు. మ‌రి సెన్సార్ వాళ్లు ఏం చేస్తారో.? వాళ్లు మాత్రం ఏ స‌ర్టిపికెట్ ఇవ్వ‌డం మాత్రం ఖాయం. మారుతికి కూడా కావ‌ల్సింది అదే. ఆ స‌ర్టిఫికెట్ చూసి జ‌నాలు తండోప‌తండాలుగా వ‌స్తార‌ని ఆశ‌. మ‌రి మారుతి ప్లాన్ నెర‌వేరుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: