తెలుగు సినిమాలు తప్ప మరో మార్కెట్ లేని అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, పవణ్ కళ్యాణ్, మహేష్ బాబు లు ఇప్పుడు టాలీవుడ్ లో దఢపుట్టిస్థున్నారు. వారితో సినిమా తీయాలంటేనే నిర్మాతలు వణికి పోతున్నారు. వీరికోసం ఇతరత్ర ఖర్చులు కలిపి తడిసిమోపెడవుతోంది అంటూ గగ్గోలు పెడుతున్నారు.

కారణం వీరు తీసుకుంటున్న పారితోషికం, యూటివి ప్రిన్స్ మహేష్ బాబుతో తీస్థున్న సినిమాకు ఆయనకు ఇస్థున్న పారితోషికం రూ. 20 కోట్లు. పెద్ద బ్యానర్ కాబట్టి భరిస్థోంది అనుకుంటే అంతకు పైస తక్కువైనా సరే మన వాళ్లతో కూడా సినిమా ఒప్పుకోవడం లేదట. ఇక రాంచరణ్ అయితే 15 కోట్ల నుంచి 20 కోట్ల మద్య పారితోషికం తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. తాజాగా చెర్రీ తో తీస్థున్న సినిమాకు బండ్లగణేష్ రూ.17 కోట్లు సమర్పించుకుంటున్నాడని అంటున్నారు.

పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ తాజాగా వస్థున్న ‘అత్తారింటికి దారేది’ లో తీసుకున్న రెన్యుమరేషన్ కేవలం రూ.17కోట్లేనట, తనకు కనీసం 20 కోట్లు అని అంటున్నాడట. పాపం వీరితో పోలిస్థే జూనియర్ ఎన్టీఆర్ ఎంతో నయమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. జూనియర్ బాద్ షా సినిమాకు తీసుకున్నది రూ.12కోట్లే అని టాలీవుడ్ టాక్.

ఇక హీరోలకు అంత ఇస్థే హీరోయిన్ల మాటేమిటి, కనీసం హీరోలకు ఇచ్చిన 20లో సున్నా కట్ చేసినా రెండు కోట్లు, స్టార్ డైరెక్టర్ ఖరీదు కనీసం ఆరు నుంచి ఏడు కోట్లు, పాపులర్ కమెడియన్ కూడా కోట్లలోనే ఉందట. ఇలా కనీసం తెలుగు సినిమా తీయాలంటే కనీసం రూ.50కోట్లు ఖర్చవుతోందని నిర్మాతలు లబోదిబో అంటున్నారు. ఇంత ఖర్చుచేస్థే కొంపదీసి బాక్సాఫీస్ వద్ద చట్టబండలయిందనుకో ఆ నిర్మాత పరిస్థితి ఏంటి. ఇదండీ అగ్రహీరోలందరు నిర్మాతల పాలిట సింహస్వప్నాలయ్యారన్న వైనం.

మరింత సమాచారం తెలుసుకోండి: