ఫేస్‌బుక్ సంచ‌న‌లం హృద‌య‌కాలేయం. సంపూబాబూ హీరోగా వ‌స్తున్న ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రిలోనూ అంతో ఇంతో ఆస‌క్తిని రేకెత్తిస్తోంద‌న్న‌మాట వాస్తవం. ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం అన్న కుతూహ‌లం ప‌రిశ్ర‌మ‌లోనూ ఉంది. కానీ ఎవ్వరూ బ‌య‌ట‌ప‌డ‌డం లేదు. ఆ అడుగు ముందుగా వేశాడు మారుతి.

ఈ సినిమాని టోకున కొనేశాడ‌ట‌. నేను మార్కెటింగ్ చేసి పెడ‌తా - అని మాట ఇచ్చాడ‌ట‌. అంటే హృద‌య‌కాలేయం పై మారుతి ముద్ర ప‌డుతుంద‌న్న‌మాట‌. అంతే కాదు.. సంపూ న‌ట‌న‌కు డంగైపోయి - నా సినిమాలో క‌మెడియ‌న్‌గా చేస్తావా?  అని ఆఫ‌ర్ కూడా ఇచ్చాడ‌ట‌. మారుతి అడ‌గ్గానే ఎగిరి గంతేసి ఒప్పేసుకొంటే బ‌ర్నింగ్ స్టార్ ఎలా అవుతాడు.

 క‌మెడియ‌న్‌గానా?  మీ సినిమాలోనా? అన్న‌ట్టు ఓ చూపు చూశాడ‌ట‌. హీరోగా త‌ప్ప అల్లరి చిల్ల‌ర వేషాలేయ్య‌ను అనేశాడ‌ట‌. అలా... మారుతి సినిమాలో సంపూని చూసే ఛాన్స్ మిస్ అయ్యింది. ఏదైతేనేం ఈ సినిమా మాత్రం మారుతి చేతికి అందింది. హృద‌య‌కాలేయాన్ని అలా వ‌దిలేస్తాడా?  లేదంటే త‌న మార్కు బూతు పైత్యం జోడించి మ‌సాలా ద‌ట్టించి వ‌దులుతాడా అనేదే డౌటు..!

మరింత సమాచారం తెలుసుకోండి: