‘అత్తారింటికి దారేది’ సినిమా వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెరిగే ఇమేజ్ ఎంతో తెలియదు కాని, ఈ సినిమాలో పవన్ కు అత్త గా నటిస్తున్న ఒకనాటి హీరోయిన్ నదియా కు మాత్రం ఈ సినిమా విడుదల కాకుండానే మంచి క్రేజ్ టాలీవుడ్ లో వస్తోంది. నదియా ఈ సినిమాలో పవన్ కు అత్తగారు గా చాలా చక్కగా పవన్ వేసే పంచ్ డైలాగ్స్ కు సరితూగుతూ బాగా నటించిందని ఈ సినిమా రషేస్ చూసినవారు అంటున్నారు.

ఒకనాడు మెగాస్టార్ చిరంజీవి, వాణిశ్రీ లతో నిర్మింపబడిన ‘అత్తకు యముడు- అమ్మాయికి మొగుడు’ స్థాయి లో ;అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ – నదియా ల మధ్య మంచి డైలాగ్స్ వార్ ఉంటుందని ఈ డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయని అంటున్నారు. ఈ సినిమాలో చాలెంజింగ్ గా చెయ్యవలసిన అత్తపాత్ర ఎవరి చేత చేయిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు బాగా అలోచించి నదియా ను ఎంపిక చేశారు అట. వారి నమ్మకాన్ని నదియా నిలబెట్టిందని అంటున్నారు.

ఈ వార్తలు ఫిలిం నగర్ లో రావడం మొదలు పెట్టిన వెంటనే ఇంకా ఈ సినిమా విడుదల కాకుండానే నదియా ఇంటికి దారేది అంటూ కొంతమంది నిర్మాతలు తాము తియ్యబోయే సినిమాలలో అమ్మ,అత్త పాత్రల కోసం నదియా ఇంటి ముందు క్యూ కడుతున్నారట. సినిమా విడుదల కాకుండానే ఇంత క్రేజ్ తెచ్చుకున్న నదియా అదృష్టం కలిసివచ్చి ఈ సినిమా సూపర్ హిట్ అయితే అమ్మ, అత్త పాత్రల విషయంలో టాలీవుడ్ క్వీన్ లా మారిపోతుందేమో ఈ 45 సంవత్సరాల వయసు కల వన్నెతగ్గని భామ.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: