ఆన్ స్క్రీన్ మీద హీరో, హీరోయిన్ ఎవరైనా సరే అందంగా కనిపించాలి. ముఖ్యంగా హీరోయిన్ అయితే నాజూగ్గా కనిపించాలి. లేదంటే ప్రేక్షకులు మొహం చాటేస్తారు. అందుకేనేమో హీరోయిన్లు ఫిట్ నెస్ కోసం తెగ కష్టపడుతుంటారు. అదీ స్టార్ హీరోయిన్లు అయితే..  పాపం డైట్ కంట్రోల్ అని.. ఎక్సర్ సైజులు అని నానా కష్టాలు పడాల్సిందే లేకపోతె ఫ్యాన్స్ తమ మీద అటెన్షన్ కోల్పోతారేమో అన్న భయం ఉంటుంది.


బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ ఇటీవలె ఓ కుమారుడుకి జన్మనిచ్చింది. ఆ సమయంలో కాస్తంత ఫిట్ నెస్ కోల్పోవడం సహజం. దీంతో ఈ అందాల తార ఫిట్ నెస్ కోసం తెగ తాపత్రయ పడింది. జిమ్ లో ఎక్సర్ సైజ్ చేసి చివరకు మునుపటిలా ఫిటెనెస్ సాధించింది. జీరో సైజ్ కు నిలువెత్తు రూపం అన్నట్టుగా ఉండే కరీనా ఇప్పుడు మునుపటి సెక్సీ ఫిగర్ తో ట్రాక్ లోకి వచ్చేసింది.


రీసెంట్ గా ఈ బ్యూటీ హీరోయిన్ ఫిల్మ్ ఫేర్ మ్యాగ్ జైన్ కవర్ ఫొటో షూట‌ింగ్ లో పాల్గొన్నారు. ఈ ఫోటోలు ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. కరీనా గత ఏడాది కీ అండ్ కా.. ఉడ్తా పంజాబ్ సినిమాల్లో నటించింది. ప్రెజెంట్ వీరే ది వెడ్డింగ్ మూవీలో యాక్ట్ చేస్తోంది. ఆఫ్టర్ మ్యారేజ్ కాదు కాదు ఓ బాబుకి జన్మనిచ్చాక కూడా కరీనా తన లుక్ పై పెడుతున్న దృష్టి చూస్తుంటే ఎప్పటిలానే తను సినిమాల్లో కూడా అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: