బాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు, అమెరికా సంతతికి చెందిన టామ్‌ ఆల్టర్‌(67)  బోన్‌ కెన్సర్‌ బాధపడుతున్నారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతలో బాధపడుతున్న టామ్ ఆల్టర్ కు బోన్ కేన్సర్ నాల్గో స్టేజ్ లో ఉంది.  ఈ విషయంపై టామ్‌ ఆల్టర్‌ కొడుకు జెమీ ఆల్టర్‌ను సంప్రదించగా అస్వస్థతకు గురైన విషయం వాస్తవేమేనని ప్రస్తుతం ఈ విషయం గురించి తాను ఏమీ మాట్లాడలేనని స్పష్టం చేశారు.  
Image result for Veteran actor Tom Alter son Jamie alter
కాకపోతే పూర్తి వివరాలు తర్వాత వివరిస్తానని మీడియా తో అన్నారు.   టామ్‌ఆల్టర్‌ పలు బాలీవుడ్‌ చిత్రాల్లో, టీవీ సిరీస్‌ ప్రోగ్రామ్‌లో నటించారు. టామ్‌ చివరగా ఇమ్రాన్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ‘సర్గోశియాన్‌’ చిత్రంలో నటించారు.  

విలన్ గా ఆయన ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇండియా షో బిజ్ ప్రోగ్రామ్ ద్వారా టామ్ ఆల్టర్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. 2008 లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: