తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  అయితే చిరంజీవి  తమ్ముడు నాగబాబు ‘రాక్షసుడు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఒకటీ రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించారు.  తర్వాత కాలంలో నిర్మాతగా మారిన ఆయన  చిరంజీవి .. పవన్ కల్యాణ్ .. చరణ్ సి నటించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.  

మొదట్లో సినీ రంగంపై పెద్దగా ఇంట్రెస్ట్ లేని నాగబాబు అన్నయ్య చిరంజీవి సలహా మేరకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని అన్నారు.  ఒక వైపున నిర్మాతగా కొనసాగుతూనే అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేశానని..అదీ తన సన్నిహితులు ఒత్తిడి చేయడం వల్లే చేసేవాడినని అన్నారు.  నిర్మాతగా చాలాకాలం కొనసాగిన తరువాత గానీ, తనకి ఆ ప్రొఫెషన్ సెట్ కాదనే విషయం అర్థమైందని చెప్పారు.

ఇక నిర్మాతగా ఎన్నో వొడిదుడుకులు ఉంటాయని..ఏ రేంజ్ లో వారికైనా హిట్టు, ఫ్లాపులు సహజమని అయితే ఈ ప్రభావం మాత్రం నిర్మాతలపై చాలా ఉంటుందని వాపోయారు.  అల్లు అరవింద్ సపోర్ట్ కూడా తనకి ఉండేదని చెప్పారు. అయినా తాను నిర్మాతగా సక్సెస్ కాలేకపోయాననీ, తనలో నిజమైన ప్రొడ్యూసర్ లేకపోవడం అందుకు కారణం కావొచ్చని చెప్పుకొచ్చారు.   ప్రస్తుతం నాగబాబు జబర్ధస్త్ కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: