‘జైలవకుశ’ 6 రోజులలో విడుదల కాబోతున్న నేపధ్యంలో జూనియర్ అభిమానులలోనే కాకుండా మీడియా వర్గాలలో కూడ ఎక్కడ చూసినా ‘జై లవ కుశ’ కు సంబంధించిన వార్తలు గాసిప్పులతోనే హడావిడి కనిపిస్తోంది. ఇప్పటికే ఈసినిమా సెన్సార్ పూర్తి అయిన నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ ఇప్పుడు లేటెస్ట్ గా ప్రచారంలోకి వచ్చింది.

ఈసినిమాలో ఒకటి రెండు పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయని ఆ డైలాగ్స్ కు సెన్సార్ వర్గాలు అబ్యంతరాలు చెప్పడంతో మ్యూట్ పడిందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆ ఒకటి రెండు డైలాగ్స్ పవన్ ను టార్గెట్ చేసేవిగా ఉన్నాయని అని అంటున్నారు. అయితే వివాదాలకు దూరంగా ఉండే మనస్థత్వం ఉన్న కళ్యాణ్ రామ్ జూనియర్లు ఇటువంటి సాహసం చేయడానికి ఇష్టపడ్డారా అన్న అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. 

అయితే గత కొంత కాలంగా తిరిగి జూనియర్ ను తెలుగుదేశ పార్టీ క్రియాశీలక రాజకీయాలలోకి తీసుకురావాలి అన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో తాను మళ్ళీ తెలుగుదేశ పార్టీ ప్రచారానికి ఆ పార్టీ రాజకీయ అవసరాలకు తాను సిద్ధం అన్న సంకేతాలు ఇవ్వడానికి ఇటువంటి ప్రయోగం జూనియర్ చేసాడా అన్న అనుమానాలు కూడ వస్తున్నాయి. అయితే ఇది అంతా ఎవరో కావాలని ఈసినిమా పై పవన్ అభిమానులలో ద్వేషం కలిగించడానికి క్రియేట్ చేసిన రూమర్ అన్న మాటలు కూడ ఉన్నాయి. 

ఇలా ఉండగా అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరిగిన ఈసినిమా బయ్యర్లు నష్టపోకుండా ఉండాలి అంటే ఈమూవీకి ఖచ్చితంగా 100 కోట్ల కలక్షన్స్ పైన రావాలి అని అంటున్నారు. ప్రస్తుతం జి ఎస్ టి అమలులో ఉన్న నేపధ్యంలో పన్నుల రూపంలోనే చాల కలక్షన్స్ కరిగిపోతాయి కాబట్టి ఈసినిమాకు కనీసం మూడు వారాలపాటు అన్ని సెంటర్స్ లోను హౌస్ ఫుల్ కలక్షన్స్ వస్తే కాని ఈసినిమా బయ్యర్లు నిలబడరు అన్న ప్రచారం జరుగుతోంది ఇలాంటి పరిస్థుతులలో పొలిటికల్ పంచ్ లను నమ్ముకుని జూనియర్ సాహసం చేస్తే దానికి భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: