టాలీవుడ్ క్యూట్ బ్యూటి సమంత మోటార్ బైక్ పై భాగ్యనగరంలో చక్కర్లు కొట్టింది. అంతేకాదు అందమైన ప్రకృతిని మబ్బుల మాటున చూస్తూ మైమరిచి పోయింది. ఇది ఎదో సినిమా షూటింగ్ కాదు. నిజంగానే సమంతజనం మధ్య తిరిగింది. ఆర్యా బైక్ ను డ్రైవ్ చేస్తుంటే సమంత ఆర్యా వెనుక కూర్చుని సిటీ అందాలు చూసింది. హీరో సిద్దార్ద్ ప్రేయసీ ఏమిటి తమిళ హీరో అర్యాతో చక్కర్లు ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా! అయితే ఈ ఆర్యా తమిళ హీరో ఆర్యా కాదు ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాకు ఎసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆర్య, సమంత ముద్దుముద్దు గా అడిగేసరికి ఈ ఆర్యా సమంతను భాగ్యనగరం అంతా ఒక చుట్టుచుట్టాడట.

ఇంత జరుగుతున్న తనను ఎవ్వరు గుర్తు పట్టలేదనీ మురిసిపోతూ సమంత ఈ వార్తను తన ట్విటర్ లో పెట్టి తన అభిమానులకు షాక్ ఇచ్చింది. మరి రేపు ఈ బ్యూటి తన ట్విటర్ లో మరే కొత్త షాక్ ఇస్తుందో చూద్దాం...

మరింత సమాచారం తెలుసుకోండి: