రాత్రి జరిగిన ‘స్పైడర్’ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో మహేష్ తన అభిమానులు చేస్తున్న హంగామాను చూసి నవ్వుతూ చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న విషయమై చాలామంది ఆ ఫంక్షన్ కు వచ్చిన వారు చర్చలు చేసుకున్నట్లు టాక్. సామాన్యంగా టాప్ హీరోల అభిమానులు తమ హీరోను చూడగానే విపరీతమైన ఎమోషన్ కు లోనౌతారు.

అటువంటి సందర్భమే నిన్న ‘స్పైడర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడ జరిగింది.  తన అభిమానుల్ని కంట్రోల్‌ చేయడానికి మహేష్‌ శతవిధాలా ప్రయత్నించాల్సి వచ్చింది. తన అభిమానుల్లాంటి వారు వేరే ఏ హీరోకు ఉండరంటూ మహేష్ ఒక కొత్త పాయింట్ చెప్పాడు. తన అభిమానులు కూడా తన సినిమా బాగుంటేనే చూస్తారు లేదంటే తన ఫ్యాన్స్ కూడ తన సినిమాలు చూడరు అన్న సెటైర్ వేసాడు మహేష్. 

దీనితో మహేష్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు వచ్చిన డిజాస్టర్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మహేష్ ఇలాంటి కామెంట్ చేసి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం అత్యఅధిక సంఖ్యలో ఉన్న మహేష్ ఫ్యాన్స్ అంతా ‘బ్రహోత్సవం’ సినిమాను చూసినా కనీసం అది ఎవరేజ్ హిట్ అయి ఉండేదని మహేష్ అభిప్రాయం అని అంటున్నారు.
 
అందుకే తనకు ‘బ్రహ్మోత్సవం’ లాంటి ఫ్లాపులు వచ్చాయి అన్న విషయాలను గుర్తుకు చేసుకుంటూ ఆసినిమాకు తన అభిమానులు సైతం సినిమాకు దూరంగా ఉన్నారన్న ఫీలింగ్ తో మహేష్ ఈకామెంట్ చేసి ఉంటాడు అని అంటున్నారు. అంతేకాదు తన అభిమానులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరడం వెనుక మిగిలిన హీరోల ఫ్యాన్స్ లను చూసి తన ఫ్యాన్స్ కూడ మారాలని ఇండైరెక్ట్ గా కోరుతూ సంకేతాలు ఇచ్చాడు అనుకోవాలా? లేదంటే ‘స్పైడర్’ ఫైనల్ రిజల్ట్ గురించి లోలోపల మహేష్ కు బయటకు చెప్పుకోలేని భయాలు ఉన్నాయా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: