కమలహాసన్‌ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయిన నేపధ్యంలో లేటెస్ట్ గా మీడియాతో మాట్లుడుతూ ఆయన  చేసిన కామెంట్స్ సూపర్  స్టార్ రజనీకాంత్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ సమీకరణలు మారిన నేపధ్యంలో ఇటీవల కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని రాజకీయ పార్టీ ఏర్పాటుపై సంకేతాలిచ్చాడు కమల్. 

ఈమేరకు విజయదశమికి తన రాజకీయపార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలియచేసాడు. ఈ సందర్భంలో కమల్ చేసిన కామెంట్  త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ అభిమానులు మంట పుట్టించింది. రజనీకాంత్ తాను ప్రారంభించబోయే పార్టీలో చేరతాను అంటే తనకు అభ్యంతరం లేదు అంటూ కమల్ అన్న మాటలు ఇప్పుడు తమిళనాడులోని రజనీకాంత్ అభిమానులకు విపరీత మైన అసహన్నాన్ని కలిగిస్తున్నాయి. 

రజనీ స్థాయికి కమల్ పెట్టబోయే పార్టీలో చేరవలసిన అవసరం ఏమి ఉంది అంటూ రజనీ  అభిమానులు కమల్ ను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు తాను వామపక్షాలతో కలవబోతున్నాడంటూ వచ్చిన వార్తలని కూడా ఖండించాడు కమల్. ప్ర‌స్తుతం ఉన్న ఏపార్టీ త‌న విప్ల‌వాత్మ‌క భావ‌జాలానికి అనుగుణంగా లేవ‌ని త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లోనే కొత్త పార్టీ పెట్టాల‌న్న ఆలోచ‌న తనకు వ‌చ్చిన‌ట్లు ఈ సంద‌ర్భంగా కమల్ చెపుతున్నాడు. 

అయితే రజినీకాంత్ ఇంకా తన రాజకీయ పార్టీ ప్రకటన చేయకుండానే ఇంత హడావిడిగా కమల్ ముందుకు రావడాన్ని చూసిన వాళ్ళు ఇది అంతా రజినీకాంత్ కు వ్యూహాత్మకంగా కమల్ ద్వారా చెక్ పెట్టించడానికి ఈ ఎత్తుగడ అని కూడ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఒకనాటి ప్రియ మిత్రులు రజినీ కమలహాసన్ లు రెండు వేరువేరు పార్టీలు పెట్టే ప్రయత్నాలు చేస్తూ భిన్న ధృవాలుగా మారిపోవడం ప్రస్తుతం తమిళ రాజకీయాలలో సంచలనంగా మారిపోయింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: