విజయ్ దేవరకొండ గతంలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా పాపులర్ కాదు. కాని అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. యుత్ ఫుల్ మూవీ కాబట్టి ఈ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయాడు. అంతేకాదు తనకు తానే కొత్త స్టార్ అని చెప్పేసుకుంటున్నాడు. అలాగే ఫ్యాషన్ గురించి ఓ కొత్త నిర్వచనం చెప్పాడు.


రీసెంట్ గా టాలీవుడ్ లోకి కొత్త స్టార్ వచ్చేశాడు.. అంటూ తన గురించి తానే చెప్పేసుకుంటున్నాడు. తాను ఈ రేంజ్ కి రావడానికి కారణం అభిమానులే అని అంటున్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ మాటలు చెప్పాడు. తన ఉన్నతికి కారణమైన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.


టాలీవుడ్ లోకి కొత్త స్టార్ వచ్చేశాడు. ఎలా జరిగింది.. మీరు అభిమానం చూపించడం వల్లే సాధ్యమైంది. వాస్తవానికి ఓ ప్రయోగంలా సినిమాని మొదలుపెట్టాం. అప్పట్లో ఎవరు నమ్మలేదు. విడుదలైన తర్వాత మాత్రం హిట్ అవుతున్నాయి. దీనికి కారణం ప్రేక్షకులు నాపై అభిమానం చూపించడమే. నాకు ఇంటర్ చదివే రోజుల్లో పెద్దగా ఫ్యాషన్ గురించి తెలియదు. ఏ డ్రెస్ కనిపిస్తే అదే వేసుకునే వాడిని. నాకు డ్రెస్ ల విషయంలో మా అమ్మ సలహాలు ఇచ్చేది. ఫిట్ గా ఉండి మంచి డ్రెస్ వేసుకుంటే ఫ్యాషన్ ని ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పుకొచ్చాడు.


మరి తన తానుగా స్టార్ అని చెప్పుకుంటున్న విజయ్ ఇలానే వరుస విజయాలు అందుకుంటాడా ఒకటి రెండు సూపర్ హిట్లకే ఇలా తన ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించేస్తే మరి ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన హీరోలు ఎలా ఫీల్ అవ్వాలో అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: