తెగింపు లేకుండా ఆలోచనలు ఉండవు అని అభిప్రాయపడే పోసాని కృష్ణ మురళీ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. రచయితగా దర్శకుడుగా నిర్మాతగా ఎన్నో పరాభవాలు ఎదుర్కున్న పోసాని తన జీవితంలో ఎదురైనా కష్టాల నుండి పాఠాలు నేర్చుకుని ప్రస్తుతం టాప్ యాక్టర్ గా మారిపోయాడు.

మెంటల్ కృష్ణగా ప్రేక్షకుల చేత అభిమానంగా పిలిపించుకునే పోసాని తాను ‘మెంటల్ కృష్ణ కాదు మెటల్ కృష్ణ’ అని అంటున్నాడు. తాను నిక్కచ్చిగా మాట్లాడటం చాలందికి మెంటల్ గా అనిపిస్తుందని అంటూ తనకు జీవితంలో నటించడం రాదు అని అంటున్నాడు. 

ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు. తాను చిన్నప్పుడు తన తల్లితండ్రుల వద్ద చాల గారంగా పెరిగిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తన తండ్రి అనాలోచితంగా పేకాటకు బానిసగా మారడంతో అప్పట్లోనే 8 కోట్ల విలువైన ఆస్థులను పోగొట్టుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

ఈ విషయాలను తన తల్లి తన తండ్రిని నిలదీస్తే అవమానంగా భావించిన తన తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో తమ కుటుంబం రోడ్డు పై పడ్డ విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఆతరువాత తాను సినిమాలలోకి వచ్చిన విషయాన్ని బయట పెడుతూ తాను దేనికైనా సద్దుకుపోతాను కాని అవమానాన్ని భరించను అంటూ  సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

తాను సంపాదించే ప్రతి రూపాయికి తాను ప్రభుత్వానికి పన్ను కడుతున్నానని అంటూ తాను సినిమాలలో నటించినా నటించకపోయినా తన భార్య బిడ్డలకు ఇప్పటికే నెలకు 5 లక్షలు వచ్చేలా ప్లాన్ చేసానని భవిష్యత్ లో తన ఇంటి ఖర్చులకు నెలకు 10 లక్షలు కావాలి కాబట్టి ఆరీత్యానే తాను ప్లాన్ చేసుకున్నాను అంటూ తాను తన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వారు హ్యాపీగా బ్రతికేలా వారికి ఆస్థులు ఇచ్చి ఆ తరువాత మాత్రమే తాను సినిమాల నుంచి రిటైర్ అవుతాను అని అంటున్నాడు పోసాని. అవినీతి పై తనకు ఇష్టం లేదు అని అంటూ తాను నిజంగా అవినీతి చేయాలి అనకుంటే తనకు ఉన్న రాజకీయ పరిచయాలకు ఈపాటికి కనీసం 5 వందల కోట్లు గణించి ఉండే వాడిని అని అంటున్నాడు పోసాని కృష్ణమురళీ



మరింత సమాచారం తెలుసుకోండి: