రామ్ గోపాల్ వర్మ కొంతకాలం క్రితం వరకు దేవుళ్ళ పై సెటైర్లు వేసి కేసులు పడుతున్నాయని భయం వేసి ఆ తరువాత తన సెటైర్లను మెగా ఫ్యామిలీ మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ అనేక కామెంట్స్ చేసాడు. ఈమధ్య కాలంలో విజయ్ దేవర కొండను ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్ చేసిన వర్మ ప్రస్తుతం మౌనంగా ఉండలేక ఈసారి ఏకంగా తన కూతురు రేవతి పైనే సెటైర్లు వేస్తూ పోస్టింగ్ లు పెడుతున్నాడు. 

అయితే ఈ సెటైర్లకు విసిగిపోయిన కూతురు రేవతి తన తండ్రి వర్మను తంతాను అంటూ మెసేజ్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే రేవతి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న నేపధ్యంలో ఆమె జిమ్ లో ఎక్స్ సైజ్ లు చేస్తున్న ఒక వీడియోను తన తండ్రికి ఈమధ్య షేర్ చేసింది. 

అయితే వర్మ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కూతురు తనను కొట్టడానికి ఎక్స్ సైజ్ లు చేస్తోంది అంటూ జోక్ చేసాడు. ఈ జోక్ కు ఉలిక్కి పడ్డ వర్మ కూతురు తాను నిజంగానే అమెరికా నుండి వచ్చి తన తండ్రిని కొడతాను అంటూ జోక్ చేసింది. 

ఈవిషయాన్ని మరింత లైట్ చేసిన వర్మ ఇక తాను చిన్నప్పుడు నేర్చుకున్న బ్రూస్ లీ ఎక్స్ సైజ్ లను తిరిగి ప్రాక్టీస్ చేస్తున్నాను అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. దీనితో ఈ కామెంట్స్ తో పాటు ఈవిషయాలకు సంబంధించిన ఫోటోలు కూడ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మరి త్వరలో వర్మ కూతురు రేవతి ఇండియా వచ్చి వర్మ కూతురు రేవతి తన వార్నింగ్ నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: