నిన్న జరిగిన అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కార అవార్డు ను అందుకున్న తరువాత దర్శకుడు రాజమౌళి ఆ సభలో అక్కినేని జీవితం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఏ.ఎన్.ఆర్ జాతీయ పురస్కారం అందుకోవడం తనకు గర్వంగా ఉంది అని చెపుతూ ఆ పురస్కారానికి గౌరవం తెచ్చేలా మరింత కష్టపడతానని రాజమౌళి అభిప్రాయ పడ్డాడు. 

ఇదే సందర్భంలో రాజమౌళి అక్కినేని గురించి మాట్లాడుతూ 1974లో ఎ ఎన్ ఆర్ కు 55 సంవత్సరాల వయస్సులో గుండెపోటు వచ్చినప్పుడు ఆయన గుండె 14 సంవత్సరాల పాటు గ్యారెంటీగా పని చేస్తుందని వైద్యులు చెప్పిన విషయాన్ని గుర్తు చేసాడు. తరువాత తిరిగి 1988లో మళ్లీ రెండోసారి గుండెపోటు వచ్చిన సందర్భంలో ఆయనకు వైద్యం చేసిన డాక్టర్లు కేవలం కొద్ది వారాలు మాత్రమే బ్రతుకుతారని చెప్పినా అది పట్టించు కోకుండా కేవలం మందులు వేసుకుంటూ ఆ తరువాత కూడ ఎన్ని హిట్ సినిమాలలో నటించిన విల్ పవర్ అక్కినేని సొంతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు రాజమౌళి.  

ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నా మృత్యువును తన వద్దకు రావద్దు అని సాసించడమే కాకుండా మహాభారతలో భీష్ముడు లా తనకు 90 సంవత్సరాలు వచ్చిన తరువాత తనకు తన జీవితం పై బోరుకొట్టి నవ్వుతూ మృత్యువును ఆనందంగా ఆహ్వానించిన నిజమైన కర్మయోగి అక్కినేని నాగేశ్వరావు అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ ఈ ఫంక్షన్ కు హాట్ టాపిక్ గా మారాయి.  అటువంటి మహానుభావుడి పేరున ఏర్పరిచిన అవార్డుకు తాను అర్హుడినా అన్న భావన తనకు కలుగుతోంది అంటూ తనలోని వినమ్రతను చాటుకున్నాడు రాజమౌళి. 

ఈ సభలో పాల్గొన్న ఉపరాస్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలోనే కాదు భారతీయ సినిమా చరిత్రలో అక్కినేనిది ఒక ప్రత్యేక అధ్యాయం అంటూ కామెంట్ చేసారు. తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు సినిమా రంగ ప్రముఖులు అక్కినేని కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ అవార్డు ఫంక్షన్ అత్యంత ఘనంగా జరిగింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: