శివతాండవం గురించి ఎరుగని వారు ఉండరు. గతంలో వచ్చిన అనేక  పురాణ సినిమాల్లో శివతాండవం సీన్స్ ను ప్రేక్షకులు చాలసార్లు చూసారు. కొద్ది సంవత్సరాల క్రితం చిరంజీవి నటించిన ‘ఆపద్భాందవుడు’ సినిమాలో కూడ చిరంజీవి చేత శివతాండవం డాన్స్ చేయించారు. 

మరి అటువంటి శివ భక్తుడైన రావణుడు చేత ‘జై లవ కుశ’ లో జూనియర్ చేత రావణ తాండవం చేయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పురాణాలను బట్టి చూస్తే రావణుడు సకల కళాప్రియుడు కావడనే కాకుండా స్వయంగా వీణ వాయించగల శక్తీ ఉన్న మహా భక్తుడు అన్న విషయం తెలిసిందే. 

గతంలో సీనియర్ ఎన్టీఆర్ రావణాసురుడుగా నటించిన సినిమాలలో కూడ వీణ వాయించిన సన్నివేశాలను చూసాం. అయితే ఇప్పటి వరకు రావణుడు డాన్స్ చేసినట్లు ఏసినిమాలోను చూపించలేదు. అందుకే ‘జై లవ కుశ’ లో ఈ ట్రెండ్ పెట్టారు అన్న వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారంమేరకు ‘జై లవ కుశ’ లో తమన్నాతో చేసిన ఐటమ్ సాంగ్ లో జూనియర్ సోషల్ రావణుడుగా బీభత్సంగా నృత్యం చేసాడని వార్తలు వస్తున్నాయి. దీనికే జూనియర్ రావణ తాండవం అన్న పేరు పెట్టారు. 

ఇప్పటికే తమన్నా ఐటమ్ సాంగ్ టీజర్ కు విపరీతమైన స్పందన వచ్చిన నేపధ్యంలో ఈ శివ తాండవం బిట్ ను కూడ ఈమూవీ విడుదలలోపే విడుదల చేయబోతున్నారు. ఈ మూవీకి జరుగుతున్న పబ్లిసిటీని చూస్తూ ఉంటే టాక్ తో సంబంధం లేకుండా ‘జై లవ కుశ’ కు అత్యంత భారీ కలక్షన్స్ వచ్చే ఆవకాశం కనిపిస్తోంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: