ఈ నెల 21 న విడుదల అవుతున్న తన సినిమా జై లవ కుశ తో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందరకి రాబోతున్నాడు. తన గత మూడు సినిమాలూ టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనత గ్యారేజ్ హిట్ లు అవ్వడం తో ఎన్టీఆర్ కొత్త సినిమా మీద కూడా చాలానే అంచనాలు ఉన్నాయి.


ఆ సినిమా కి సంబంధించిన ప్రమోషన్ లలో భాగంగా బిజీ గా ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా భారీ వసూలు చేసి తీరుతుంది అంటున్నాడు. అయితే ఆ సినిమా వచ్చిన వారానికే స్పైడర్ రాబోతోంది కదా మరి పోటీ ఉండదా అంటే .. " ఉంటుంది కానీ సినిమాలో కంటెంట్ ఉండాలే కానీ వంద సినిమాలు ఒకేసారి వచ్చినా సరే ఆడి తీరతాయి " అంటున్నాడు తారక్.


ఉదాహరణ గా గత సంక్రాంతి కి విడుదల అయిన ఖైదీ , గౌతమీ పుత్ర శాతకర్ణి , శతమానం భవతి చిత్రాల సక్సెస్ ల గురించి ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.


అందువలన పోటీ గురించి ఆలోచించవలసిన అవసరం లేదనీ, కంటెంట్ వుండాలే గానీ, ఒకేసారి 100 సినిమాలు రిలీజైనా ఆడేస్తాయనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: