హీరో మహేష్ బాబు కి సంబందించిన ఏ విషయం లో అయినా సరే ఆయన భార్య నమ్రత శిరోద్కర్ హస్తం ఉండాల్సిందే. అంతగా వారిద్దరి మధ్యనా బంధం ఉంటుంది. నమ్రత రూపం లో మహేష్ యాడ్ లూ సినిమా స్టోరీ లూ ఇలా అనేక వాటి పట్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది.


మరీ ముఖ్యంగా కొత్త సినిమా స్పైడర్ ప్రమోషన్ ల విషయం లో నమ్రత విపరీతమైన కేర్ తీసుకుంటోంది అంటున్నారు. స్పైడర్ సినిమా బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ తరవాత వస్తూ ఉండడం తో స్పైడర్ మాత్రమే తమని కోలుకునేలా చెయ్యగలదు అంటున్నారు.


పైగా తమిళం లో ఒక స్ట్రెయిట్ సినిమా గా ఈ స్పైడర్ వెళుతూ ఉండడం, మహేష్ కి తమిళ్ మార్కెట్ ఓపెన్ అవుతూ ఉండడం తో రెండు చోట్లా నమ్రత దగ్గర ఉంది ప్రమోషన్ ల సంగతి చూసుకుంటోంది. టీవీ యాడ్ లు తప్ప ఈ సినిమాకి సంబందించిన ప్రతీదీ ఆమె కనుసన్నల్లో నే జరుగుతోంది అంటున్నారు.


ఈ నెల 23 వరకూ భరత్ అను నేను సినిమా షూటింగ్ లు మహేష్ బిజీ గా ఉంటాడు. ఆ తరవాత పదిరోజులు స్పైడర్ ప్రమోషన్ లకి డేట్ లు ఇవ్వాల్సిందే అని నమ్రత మహేష్ కి గట్టిగా చెప్పిందట.ఈ ప్ర‌మోష‌న్లు ఎలా చేయాలి? ఏయే రోజు ఎవరెవ‌రికి ఇంట‌ర్వ్యూలు ఇవ్వాలి? అనే విష‌యంలో న‌మ్ర‌త ఇప్ప‌టికే గైడెన్స్ జారీ చేసేసింద‌ట‌. 24 నుంచీ స్పైడర్ ప్రమోషన్ లు స్ట్రాంగ్ గా మొదలు అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: