దసరా రేస్ లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి జూనియర్ మహేష్ ల మధ్య జరగబోతున్న వార్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘జై లవ కుశ’ వార్తలే కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు నిన్నటి నుంచి ఎన్టీఆర్ విజువల్ ఇంటర్వూలు కూడ ప్రసారం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో    ‘స్పైడర్’ గురించి వార్తలు తక్కువగా ఉన్న పరిస్థుతులలో ఈతేడాకు ఎక్కడ లోపం జరిగింది అన్న విషయమై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈవిషయం పై విశ్లేషణలు చేస్తున్న విశ్లేషకులు మాత్రం కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేస్తున్నారు.    ‘జై లవ కుశ’ మేకింగ్  అంతా హైదరాబాద్ లో జరగడంతోపాటు ఈసినిమా కథను ఏమాత్రం దాచకుండా పూర్తిగా బయటకు లీక్ చేయడమే కాకుండా ఈసినిమా యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మూడు నాలుగు డైలాగులు కూడ బయటకు లీక్ చేసి ఈసినిమా పై క్రేజ్ పెంచడమే కాకుండా ఈసినిమాలోని  ఐటమ్ సాంగ్. 

అందులోని రావణతాండవం అన్ని విషయాలు బయటపెట్టడంతో  ఈసినిమాకు సంబంధించిన విషయాలపై రోజురోజుకి క్రేజ్ పెరిగి పోతోంది అని విశ్లేషకుల వాదన. అయితే ‘స్పైడర్’ విషయాలు అన్ని చెన్నై నుండే జరుగుతున్న నేపధ్యంలో ‘స్పైడర్’ సబ్జక్ట్ విజువలైజేషన్ కు సంబంధించిన విషయాలు అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించిన డైలాగులు ఎక్కడా బయటకు రానివ్వకుండా మురగదాస్ తీసుకుంటున్న మితిమీరిన జాగ్రత్తలు ‘స్పైడర్’ కు హానిచేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

స్వభావరీత్యా మురదాస్ తన సినిమాల గురించి  ముందు మాట్లాడుకోవడానికి  ఇష్టపడడు. ఈ నేపధ్యంలో  ‘స్పైడర్’ కు సంబంధించిన సీక్రెట్స్ ఏమాత్రం బయటకు రావడం లేదు అని అంటున్నారు.  అయితే మన తెలుగు ప్రేక్షకులు టాప్ హీరోల సినిమాలకు సంబంధించి లీకులను ఆశిస్తున్న నేపధ్యంలో తొలిరోజు ‘స్పైడర్’ థియేటర్ లో అడుగు పెట్టే మహేష్ అభిమానులకు మురగదాస్ అనుసరిస్తున్న వ్యూహం బెడిసికొట్టే అవకాసం ఉంది అని అంటున్నారు.  

దీనికితోడు ‘స్పైడర్’ స్టిల్  విడుదల చేయాలి అన్నా చెన్నై నుంచి అనుమతి కావాలి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో అటు మీడియా వర్గాలతో పాటు మహేష్ అభిమానులు కూడ ‘స్పైడర్’ పై అసహనంగా ఉన్నట్లు టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: