తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ..ప్రస్థానం లాంటి సూపర్ హిట్ చిత్రంతో తనకంటూ మంచి పేరు క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో శర్వానంద్.   ఆ తర్వాత ‘గమ్యం’ చిత్రంతో అద్భుత విజయం అందుకున్న శర్వానంద్  ‘రన్ రాజా రన్’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.  ఈ సంవత్సరం ‘శతమానం భవతి’ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.  తాజాగా శర్వానంద్ నటించిన ‘మహానుభావుడు’ ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.  యూవీ క్రియేషన్స్ బేనర్ పై మారుతి తెరకెక్కిస్తున్న కమర్షియల్ ఎంట‌ర్ టైన‌ర్ మహానుభావుడు.
Image result for మహానుభావుడు
శర్వానంద్, మెహరీన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో శర్వానంద్ అతి శుభ్రత పాటించే యువకుడిగా కనిపిస్తున్నాడు.  అయితే అతి ఎప్పటికైనా ముప్పు అన్న విషయాన్ని సినిమాలో మంచి ఫన్ క్రియేట్ చేస్తూ చూపించారు.  ఓసీడీ అనే డిసార్డర్ ని పట్టుకొని సినిమా మొత్తాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా రన్ చేయనున్నాడు మారుతి.

థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఇవాళ‌ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.  ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పాటలు, టీజర్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది.  ఈ సంవత్సరం  శ‌త‌మానం భ‌వ‌తి, రాధ మంచి విజ‌యం సాధించ‌డంతో మ‌హానుభావుడు సినిమాపై కూడా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక‌.. ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: