మారుతి బ్రాండ్ ఓ రేంజ్ లో బాక్సాఫీస్ ద‌గ్గర ప‌నిచేస్తోంది. అత‌డు డైరెక్ట్ చేసినా...ప‌ర్యవేక్షిణ‌లో రిలీజ్ చేసినా సినిమాలు హిట్టయి కూర్చుంటున్నాయి. ప్రస్తుతం =మారుతి ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ‌లో వ‌చ్చిన ప్రేమ‌క‌దా చిత్రం నేటితో యాబై రోజులు పూర్తి చేసుకుంది. సుదీర్ , నందిత హీరోహీరోయిన్స్ గా వ‌చ్చిన రూపొందిన ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఆ రోజు నేటి వ‌ర‌కు స‌క్సెస్ పుల్ ర‌న్ అవుతూ 53 సెంట‌ర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.

మారుతి ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ‌లో ప్రభాక‌ర్ రెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.. పెద్ద సినిమాలే యాబై రోజులు పూర్తి చేసుకోలేక‌పోతున్న ఈ రోజుల్లో ప్రేమ క‌ధా చిత్రమ్ విజ‌య‌వంతంగా అర్దశ‌తదినోత్సవం జ‌రుపుకోవ‌డం విశేష‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: