శర్వానంద్  హీరోగా మారుతి దర్శకత్వంలో  దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న 'మహానుభావుడు' పై ఇప్పడు వస్తున్న ఒక షాకింగ్ రూమర్ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ నెల 29న విడుదల కాబోతున్న ఈ సినిమా  ట్రైలర్‌ కు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో ఈచిత్రం రాబోతోంది అన్న సంకేతాలు ఇస్తోంది. 

ఈ సినిమాలో హీరో అతి శుభ్రత అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే.  అలాంటి క్యారెక్టర్‌కు లవ్ స్టోరీ జోడించి కామెడీ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమా తెరకెక్కించారు అని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈమూవీ మలయాళంలో వచ్చిన ‘నార్త్ 24 కాథమ్’ అనే మూవీ కథకు కాపీ అని ప్రచారం జరుగుతోంది. 
ఫాహద్ ఫాజిల్ స్వాతి రెడ్డి చేసిన ఈ చిత్రం 2013లో మలయాళంలో విడుదలై మంచి హిట్టయింది.  దీనితో ఈ సినిమా కధకు కొన్ని మార్పులు చేసి మారుతి

‘మహానుభావుడు’ సినిమాగా మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పడు ఈవార్తలు హాట్ టాపిక్ కావడంతో ఈవార్తల పై దర్శకుడు మారుతి స్పందించాడు.  అతి శుభ్రత అనే కథాంశంతో చాల భాషల్లో కొన్ని సినిమాలు వచ్చాయనీ అంత మాత్రాన వాటిని కాపీ కొట్టి ‘మహానుభావుడు’ తీశామనుకోవడం సరికాదని ఆసినిమాలకు తన ‘మ‌హానుభావుడు’ సినిమాకు పోలికలేదు అని అంటున్నాడు మారుతి. 

చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌ర నుండి పెద్ద‌వాళ్ల వ‌ర‌కూ నచ్చే కుటుంబ సినిమాగా ఉంటుంది అని మారుతి చెపుతున్నాడు.  శర్వానంద్  పక్కన  మెహ‌రీన్ హీరోయిన్ నటిస్తున్న ఈసినిమా అనుకోని విజయాలు సాధిస్తుందా అన్న అంచనాలు ఈపాటికే రోజురోజుకీ పెరిగి పోతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: