మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న  మహేష్ బాబు సినిమా స్పైడర్ మీద ప్రిన్స్ - సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ తో పాటు సాధారణ సినిమా ప్రేక్షకులు కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యూ. ఏ సర్టిఫికేట్ దక్కింది. సినిమాలో ఎక్కడా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ సీన్ కానీ లేకపోవడం తో సినిమా స్టార్టింగ్ లో రావాల్సిన స్మోకింగ్ యాడ్ కూడా వెయ్యరు.

అయితే సెన్సార్ బోర్డు నుంచి మన వెబ్సైటు కి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే రెండున్నర గంటల నిడివి ఉన్న ఈ చిత్రం సెన్సార్ సభ్యులకి బాగా నచ్చిందట. ఎక్కడా సింగిల్ కట్ కూడా చెప్పే అవసరం లేకుండా సినిమా సాగింది అంటున్నారు.

ఈ సినిమాలో రెండ ప్రధాన  యాక్షన్ సన్నివేశాలు హై లైట్ గా నిలుస్తాయి అనుకుంటున్నారు. ఒకటి మనం ఇప్పటికే ట్రైలర్ లో చూసిన పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చే సీన్ కాగా మరొకటి కూడా అలాగే ఉంటుంది అంటున్నారు. ఆ సీన్ ను వెండితెరపైనే చూపించాలన్న ఉద్దేశంతో దానికి సంబంధించిన ఏ విజువల్ నూ మురుగదాస్ బయటకు రానీయలేదని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్టులకు పెద్దపీట వేయడంతోనే చిత్రం విడుదల అలస్యం అయిందని నిర్మాతలు వెల్లడించిన వెల్లడించారు.. ఈ రెండు సీన్ లలో వెంట్రుకలు నిక్క బోడుచుకోవడం ఖాయం అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: