ఫేస్ ఆఫ్ సినిమాకి ఎవ‌డు కీ ద‌గ్గ‌ర పోలిక‌లు ఉన్నాయా? గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్‌లో ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. ఫేస్ ఆఫ్ కి కాపీ కాదుగానీ...స్ఫూర్తిలాంటిది అని రామ్‌చ‌ర‌ణ్ కూడా ఓ సంద‌ర్భంలో ఒప్పుకొన్నాడు. అయితే ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి మాత్రం కాపీ కొట్టాల్సిన ఖ‌ర్మ నాకేంటి? అంటున్నాడు.

ఈ సినిమా ఫేస్ ఆఫ్‌కి కాపీ అట క‌దా..? అంటే ఈ ద‌ర్శ‌కుడు కాస్త సీరియ‌స్ అయిపోయాడు. ఎప్పుడో వ‌చ్చిన సినిమాని కాపీ కొట్టాల్సిన ప‌నేంటి? సొంత క‌థ ఇది. చ‌ర‌ణ్ కోస‌మే రాసుకొన్నాం అంటున్నాడు. ఈ సినిమా చూసే మిగ‌తావాళ్లు కాపీ కొట్టాలి అంటూ అతి ధీమా ప్ర‌క‌టించాడు వంశీ. క్వాలిటీ పేరుతో బ‌డ్జెట్ త‌డిసి మోపెడు చేశాడ‌ని దిల్ రాజు గ‌గ్గోలు పెడుతుంటే వంశీ మాత్రం కూల్‌గా ఉన్నాడు.

సినిమాని గ్రాండ్ గా తీయాలంటే ఆ మాత్రం ఖ‌ర్చు చేయాలి మరి అని కూల్‌గా చెబుతున్నాడు. ఖర్చు స‌రే. మ‌రి అదిప్పుడు రాబ‌ట్టుకోవ‌డం ఎలాగో దిల్‌రాజు మేధ‌స్సుకి కూడా అంతుబ‌ట్ట‌డం లేదు. ముందు అనుకొన్న‌ట్టు ఈ సినిమాని బ‌డ్జెట్‌లో పూర్తి చేస్తే... ఈపాటికి సేఫ్ జోన్‌లో ప‌డిపోదుం క‌దా? అనేది దిల్ రాజు మాట‌. అదీ కరెస్టే క‌దా?

మరింత సమాచారం తెలుసుకోండి: