టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఇనీషియల్ టాక్ అనేది కీలకం. ఈ టాక్ లో స్పష్టత లేకుండా అయోమయం ఉంటే అది ఆ సినిమా ఫలితం పై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. ఇప్పుడు ‘జై లవ కుశ’ విషయంలోనూ అదే జరగబోతోందా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. 

ఈసినిమా విడుదలకు ఒక వారం రోజుల ముందు నుంచి ర్యాపిడ్ ప్రమోషన్ భారీ ఎత్తున జరిగినా టాలీవుడ్ సినిమా సర్కిల్స్ లో 'జై లవ కుశ' మీద ఆరా తీయడం నిన్న సాయంత్రమే మొదలైపోయింది. ఈసినిమాకు సంబంధించిన స్పెషల్ షోలు ఈరోజు తెల్లవారుజాము నుండి మొదలైన నేపధ్యంలో ఈసినిమాకు సంబంధించిన మినిట్ టు మినిట్ టాక్ గురించి అనేకమంది ఈసినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ల బయట గుంపులు గుంపులుగా వెయిట్ చేస్తున్నారు అంటే ఈ మూవీ టాక్ గురించి ఎంత ఆతృత ఏర్పడిందో అర్ధం అవుతుంది.

సొంత వాళ్లకు సెలబ్రిటీలకు మీడియావాళ్లకు వేసే ‘జై లవ కుశ’ ప్రీమియర్ షోలను  ప్రొడ్యూసర్లు ఆకస్మికంగా నిలిపివేయడం వెనుక ఈసినిమా పై ఎటువంటి డివైడ్ టాక్ బయటకు రాకుండా తీసుకున్న వ్యూహాత్మక ఎత్తుగడ అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈసినిమా ప్రొడక్షన్ ప్రమోషన్ విషయాలలో కళ్యాణ్ రామ్ కి తారక్ కి మధ్య  అభిప్రాయ భేదాలు వచ్చినట్లు గాసిప్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హడావిడి చేస్తోంది. 

దీనికితోడు ఈసినిమా విషయంలో బాలయ్య ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ ఉంటుందా లేదా అనే చర్చ కూడా బాగా బాగా జరుగుతోంది. ‘జై లవ కుశ’ తారక్ పెర్ఫామెన్స్ బేస్డ్ మూవీ అంటూ ఇప్పటికే వార్తలు ఉన్నా ఈసినిమా సక్సస్ పై ఒక డివైడ్ టాక్ నడుస్తోంది. 

దీనికితోడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ కూడ ఈసినిమా రిజల్ట్ ను ప్రభావితం చేస్తుందా అన్న టాక్ కూడ వినిపిస్తోంది. ఈసినిమా పై భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో రిజల్ట్ ఏమాత్రం తేడా అనిపించినా ఈసినిమా కలక్షన్స్ పై విపరీతమైన ప్రభావాన్ని చూపించే ఆస్కారం ఉంది. ఏది ఏమైనా ‘జై లవ కుశ’ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: