మెగా మేనల్లుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరస ఫ్లాప్ సినిమాల మెగా యంగ్ హీరోగా మారడంతో ఈ యంగ్ హీరో పై ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో బాగా ఆశక్తి తగ్గింది. దీనితో తేజు ఖాళీగా కూర్చోవడం ఎందుకు అని  కొన్ని సినిమాలలో అతిథి పాత్రలు కూడ చేస్తున్నాడు.  

ఈమధ్య  కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘నక్షత్రం’ చిత్రంలో కూడా  తేజు ఒక ప్రత్యేక పాత్ర చేసిన విషయం తెలిసిందే. అయితే ‘నక్షత్రం’ భయంకరమైన ఫ్లాప్ గా మారిన నేపధ్యంలో సాయి ధరమ్ తేజ్ కు ఈప్రయోగం వాళ్ళకు ఏమాత్రం కలిసిరాలేదు. 

అయితే పట్టు వదలని ‘విక్రమార్కుడి’ లా సాయి ధరమ్ తేజ్ ఇప్పడు మరో సినిమాలో అతిథి పాత్రలో మెరవనున్నాడు. అది కూడ ఒక ఐటమ్  సాంగ్ లో కనిపించనున్నాడటనే టాక్ వినిపిస్తోంది. 

రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాజా ది గ్రేట్’ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపధ్యం లో రీసెంట్ గా ఈ సినిమా కోసం ఓ ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించారు. రాశి ఖన్నా ఈ  సాంగ్ ఐటమ్ గర్ల్ గా డాన్స్ చేస్తూ ఉంటే ఈ ఐటమ్ సాంగ్ లో సాయి ధరమ్ తేజ్ వేసే స్టెప్పులు కూడ కనిపిస్తాయనే వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు రవితేజ రాశి ఖన్నాలతో పాటు కొన్ని నిమిషాల పాటు తేజు గెస్ట్ ఎపిరియన్స్  ఉంటుందని అంటున్నారు.   తేజు స్పెషల్ క్యారెక్టర్ చేసినా ‘నక్షత్రం’ ఫెయిల్ అయిన నేపధ్యంలో అదే బ్యాడ్ సెంటిమెంట్ రవితేజాను కూడ వెంటాడుతుందా అంటూ మాస్ మహారాజ అభిమానులు భయపడుతున్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: