తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మహానటి సావిత్రి జీవిత చరిత్రగా 'మహానటి' తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో ఇప్పటికే పలువురు నటీ, నటులను తీసుకున్నారు.  లీడ్ రోల్ లో మళియాళ భామ కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రంలో సమంత, ప్రకాష్ రాజ్, మళియాళ నటుడు దుల్కన్ సల్మాన్, అర్జున్ రెడ్డి పేమ్ షాలిని పాండే, మాళవిక నాయర్ లు నటిస్తుండగా..మహానటులు ఎస్వీ రంగారావు పాత్రలో విలక్షన నటులు మోహన్ బాబు నటిస్తున్నారు.  
Image result for mahanati movie stills
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోదావరి జిల్లాల్లో జరుగుతోంది. ఇక ఎన్టీ రామారావు పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషించనున్నాడనే టాక్ చాలాకాలంగా వినిపిస్తోంది.  ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో తాను కనిపించబోతన్నట్లు వార్తలు వస్తున్నాయి..కానీ ఆ చిత్రంలో నేను నటించడం లేదు.
Image result for mahanati movie stills
అంతే కాదు ఈ చిత్రం గురించి ఇప్పటి వరకు తన వద్ద ఎవరూ ప్రస్తావించనూ లేదని అన్నారు. ఎన్టీ రామారావు పాత్రను చేయడం అంత తేలికైన విషయం కాదని అన్నాడు. ఒకవేళ సంప్రదిస్తే చేస్తాడా .. లేదా అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: