రాంచరణ్ ప్రతిభ కారణంగా మరో హీరో ప్రభాస్ ఇబ్బందుల్లో పడ్డారు. రాంచరణ్ లా నైపుణ్యాన్ని ప్రదర్శించలేక తను కొత్తగా తీస్థున్న ‘బాహుబలి’ సినిమాలో తెగ ఆపసోపాలు పడుతున్నాడు. డైరెక్టర్ రాజమౌళి మాత్రం రాంచరణ్ కు ధీటుగా కాకున్నా కాస్థా దగ్గరగా నైనా ప్రభాస్ తో చేపించాలని తెగ ప్రయాస పడుతున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ప్రభాస్ నటనలో రాంచరణ్ కంటే వీక్ అని, చెర్రీలా నటించడం చేతకాక ఇబ్బంది పడుతున్నాడనుకుంటే పొరపాటే. రాంచరణ్ తో పోలిస్థే ప్రభాస్ ఏమాత్రం తీసుపోడు, ఎత్తు, దానికి తగ్గ ఫిజిక్ తో హీరో పాత్రకు నిండుకుండలా సరిపోతాడు. అయినా కూడా చెర్రీతో పోటీ పడలేక ‘బాహుబలి’లో ఎందుకు ఇబ్బంది పడుతున్నాడన్నదే కదా మీ సందేహం.

బాహుబలి సినిమాలో గుర్రం స్వారి చేసే సీన్లు చాలా ఉన్నాయి. అలాగే గుర్రంపై స్వారీ చేస్థూ కత్తితో యుద్దం చేసే సీన్లు చాలా ఉన్నాయి. అంతే కాక ఆయన ఎత్తు, పర్సనాలిటి వంటివి కూడా గుర్రంతో కాస్థా ఇబ్బంది తెచ్చిపెడుతోంది. కాని మగధీరలో రాంచరణ్ గుర్రం స్వారీతో స్వైర విహారం చేసారు. ఆయన గుర్రం స్వారి ప్రేక్షకులచేత శబాష్ అనిపించుకుంది. కారణం రాంచరణ్ కు గుర్రం స్వారి మొదటి నుంచి అలవాటు, తనకు ముందునుంచే స్వంత గుర్రం ఉందట, దానిపై సరదాగా కాకుండా అలవాటుగా కూడా ఎప్పుడు స్వారి చేస్థాడట, అందుకే ‘మగధీర’లో  గుర్రం స్వారీలో ఇరగదీసాడు చెర్రీ. అందుకే అంతకంటే ఎక్కువ ఫర్ పార్మెన్స్ కాకున్నా అంతకు తక్కువ కాకుంటేనే కదా బాహుబలి గుర్రం సీన్లు క్లిక్ అయ్యేది. అందుకే చెర్రీ స్కిల్ ఇప్పుడు ప్రభాస్ కు ఇబ్బందిగా తయారైందన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: