మహిషాసుర సంహారానికి సంకేతంగా జరుగుతున్న శరన్నవరాత్రుల పూజలలో ఈరోజు అమ్మని చంద్ర ఘంటా దేవి రూపంలో పూజిస్తారు. దుర్గామాత మూడవ స్వరూపంగా ఈ చంద్రఘంటా దేవి అలంకారాన్ని పరిగణిస్తారు. ఈరోజు అమ్మ స్వరూపం పరమశాంతిదాయకమై శుభములు చేకూర్చే విధంగా ఉంటుందని మన నమ్మకం. 
Related image
ఈరోజు అమ్మవారి శరీరం పసిడి వన్నెతో మెరిసిపోతూ కనిపిస్తుంది. ఈమె శిరస్సు పై అర్ధ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంవల్ల ఈ పేరు అమ్మవారికి వచ్చిందని అంటారు. ఈరోజు అమ్మవారు తన పది చేతులలో ఖడ్గం, గద, త్రిశూలం, బాణం, ధనుస్సు, కమలం, జపమాల, కమండలం, అభయముద్ర ధరించి యుద్ధముద్రలో సర్వదా యుద్ధానికి సన్నద్ధమైనట్లుగా కనిపిస్తుంది. 
Image result for చంద్ర ఘంటా దేవి
ఈమె గంట నుంచి వెలువడిన థ్వని భయంకరంగా ఉండి రాక్షసులకు భయాన్ని కలిగిస్తుంది అని పురాణాలు చెపుతున్నాయి. ఈరోజు సాధకుడు ఆమెను ఏకాగ్రతతో పూజిస్తే ఆమెను శరణు అన్న వారికి సమస్త సంసారిక కష్టముల నుంచి విముక్తులు అవుతారని అంటారు. 

అంతేకాదు ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ఇహలోకంలోనే కాకుండా పరలోకంలో కూడా సద్గతి లభిస్తుంది అని నమ్మకం. ఈరోజు  ఈమె సింహ వాహనము పై కనిపించే అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యం చేస్తారు. వేదకాలం నుండి ఈ శరన్నవరాత్రుల పూజలు చేయడం ఒక సాంప్రదాయంగా మారడంతో ఇప్పటికీ కూడ దేశం నలుమూలలా ఈ శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా ఆధ్యాత్మిక శోభతో కన్నుల పండుగగా జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: