దాన వీర శూర కర్ణ తో  విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు త్రిపాత్రాభినయం చేయటమే కాదు ప్రేక్షకలోకాన్ని మంత్రముగ్డులను చేసిన తరవాత మరెవరూ మూడుపాత్రలు ఆ స్థాయిలో పోషించిన దాఖలాలు కనిపించలేదు.  నాటి అగ్రనటులు కొందరు త్రిపాత్రాభినయంతో తమ ప్రతిభను చాటుకున్నారు. చిరంజీవి తప్ప వేరెవరూ త్రిపాత్రాభినయంలో కనిపించిన హీరోలు మనతరంలో కనిపించలేదని చెప్పొచ్చు. 

 

సమర్ధవంతమైన శక్తివంతమైన పాత్రల్లో నటించగల సత్తా, నృత్యాల్లో విరగదీయగల దమ్మున్న నటుడు తెలుగులో ప్రస్తుతం తారక్ మాత్రమె. విలనిజం ఒలికించటం,  కౄరత్వం పలికించగల కథానాయకుడు కూడా ఎన్.టి.ఆర్ మాత్రమే. జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో పాటు, "నెగేటివ్ షేడ్స్ కూడిన నాయకత్వ పాత్ర"  లో కనిపించనున్నారని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు అవధులు దాటాయి. సినిమాపై ప్రేక్షకులందరిలో ఆసక్తి పెరిగి, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు సినిమా కోసం ఆతృతగా ఎదురుచూశారు. దసరా నవరాత్రుల సందర్భంగా  “జై లవ కుశ” రిలీజై, బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 

 

జూనియర్ ఎన్టీఆర్ స్టామినా ఏంటో ప్రత్యేకించి నెగేటివ్ షేడ్స్ కూడిన "జై" పాత్రలో, ‘జై లవ కుశ’ నిరూపించింది. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటించిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా చాలా బాగుందని, అంతకు మించి ఎన్టీఆర్ యాక్షన్ అదిరిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. మూడు పాత్రలతో మూడు విధాలుగా అలరించారని ప్రేక్షకలోకం చెప్పుకుంటుంది.  


తొలి రోజు దేశ వ్యాప్తంగా రూ.25 కోట్లు + యూఎస్ బాక్సాఫీసు వద్ద 560,699 డాలర్లు (సుమారు రూ.3.64 కోట్లు) రాబట్టింది. అయితే రెండవ రోజుకే యుఎస్ బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం “ఒక మిలియన్ డాలర్ల” వసూళ్ళు సాధించిందని తెలుస్తుంది. రెండవ రోజుకే ప్రపంచ వ్యాప్త వసూళ్ళు రూ. 61 కోట్ల మార్క్ దాటేసింది.  తెలుగు సినిమా వసూళ్ళ లిస్టులో ఐదవ రాంక్ అన్నమాట. బాహిబలి 2, బాహుబలి 1, కబాలి, ఖైదీ నంబర్ 150 తరవాత ఐదవ రాంకుకు అప్పుడే చేరిపోయింది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశలు వరసగా వచ్చి ఓవర్సీస్ లో ఎన్టీఆర్ హవా కొనసాగుతోంది. ఈ సినిమా యూఎస్ లో దాదాపు రెండు మిలియన్ డాలర్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసింది.

 

తొలి రెండు రోజుల వసూళ్ళు ఈ రేంజ్‌లో ఉంటే ఈ వారాంతానికి ముందే  రూ.100 కోట్లు వసూలు చేయడం ఖాయమని సినీ విమర్శకులు అంటు న్నారు. ఎన్టీఆర్ గత చిత్రం ‘జనతా గ్యారేజ్’ప్రపంచ వ్యాప్తం గా ఫుల్ రన్ లో రూ. 134 కోట్లు వసూలు చేసింది. తెలుగు సినీ పరిశ్రమలో ఇది మూడో అత్యధిక వసూళ్ల రికార్డు.

 

ఇప్పుడు  ‘జై లవ కుశ’ దీన్ని దాటేస్తుందని, హీరో రెమ్యునరేషన్ కాకుండా, బడ్జెట్ 30 నుంచి 45 కోట్ల మధ్య అయినట్టు టాక్.  కానీ రిలీజ్‌కు ముందే తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.80  కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పుడు తొలి రోజే సూపర్  హిట్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఎన్టీఆర్ మరోసారి బాక్సాఫీసును షేక్ చేసేస్తున్నాడు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: