కొంచెం బాగుంది అని పేరొస్తే చాలు జూనియర్ నందమూరి తారక రామారావు సినిమా మార్కెట్ ను దున్నేస్తుందనేది సినీరంగం ముచ్చట. మరల మరల అదే ఋజువైందని ఉమైర్ సందు రెపోర్ట్ ద్వారా తెలుస్తుంది. కళ్యాణ్ రాం నిర్మాణత, బాబి దర్శకత్వం లో రూపు దిద్దుకున్న ఈ సినిమా దుమ్ములేపే స్పందనను చేజిక్కించుకుంది. జై పాత్ర "నెగేటివ్ షేడ్స్ కూడిన నాయకత్వ పాత్ర" లో రావణుణ్ణి గుర్తుచేస్తూ తారక్ నటించి రక్తిగట్టించగా, మరో పాత్రలో లవుడు ఒక గా బాంక్ ఉద్యోగిగా, ఇంకో పాత్రలో కుశుడు దొంగగా హాస్యం పండించారు. 


ఒకే సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో వెంటవెంటనే కనిపించి ప్రెక్షక జనులను తన చరిష్మాటిక్ యాక్షంతో మెప్పించిన ఎన్.టి.ఆర్ ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు అవధులు దాటించారు. అనుకున్నట్లే తొలివారం కూడా గడవక ముందే ముచ్చటగా మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా "వంద కోట్ల క్లబ్" లో చేరి సంచలనం సృష్టించింది. 


రాశీ ఖన్నా, నివేదా థామస్ తమ అందాలను ఆరబోస్తూ, జూనియర్ తో స్క్రీన్ పంచుకున్న ఈ సినిమాలో జై గా తారక్ విలనిజం ఒక సంచలనంగా మారింది. నాటి నందమూరి తారక రామారావుకు కాథానాయక పాత్రలతోపాటు ప్రతినాయక పాత్రలను సమానంగా నటించి మెప్పించిన ప్రత్యేకతను తారక్ గుర్తుచేస్తూ నటించటం ఘనవిజయం సాధించటం ఆయన్ ఫాన్స్ కు దసరా పండగ ముందేవచ్చినట్లైంది. 


Have a look at the tweet

Celebration Time for  Fans !  crossed " 100 cr " Worldwide in Just 3 Days..!! @tarak9999 Biggest BLOCKBUSTER ever. 

సినిమా పరిశ్రమలో జూనియర్ నందమూరి తారక రామారావుకు మహాభారతం లో కర్ణునికి ఉన్నంత నెగెటివ్ ప్రచారం ఉంది. సమర్ధుడైనా శాపాల మాటున ధీరత్వం తో జీవించిన వాడు కర్ణుడు. ఆయన ధీరత దానశీలతను ఎవరూ ప్రశ్నించ లేని విధం గా ఆయన ప్రవర్తించారు. అలాగే జూనియర్ సామర్ధ్యం కూడా. ఎంత నెగెటివ్ ప్రచారమున్నా, జై లవ కుశ మూడురోజుల్లో Rs.100 కోట్లు మార్క్ అతి సునాయాసంగా దాటేసి తనకు దేన్నైనా సాధించే సామర్ధ్యం ఉందని ఋజువౌతుంది. 

    మరింత సమాచారం తెలుసుకోండి: