ఈరోజు అమ్మ అన్నపూర్ణ రూపంలో రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లిగా దుర్గాదేవి అన్నపూర్ణగా కనిపిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది నమ్మకం. అన్నపూర్ణ అంటే ఈశ్వర స్వరూపం. 

అన్నపూర్ణను లక్ష్మీ సరస్వతుల రూపంగా కూడ కొలుస్తారు. సర్వమంగళకారిణి అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు ఈతిబాధలు తొలగిపోతాయని పెద్దలు అంటారు. ఆక‌లితో ఉన్న వారెవ‌రికైనా అన్నం పెట్టి ఆద‌రించమ‌నే సందేశము ఈ అవతారంలో అర్ధమవుతుంది. కుటుంబంలో త‌ల్లిపాత్రకు ఉన్న ప్రాథాన్యాన్ని ఈ అవతార‌ము మ‌న‌కు బోద‌ప‌డేలా చేస్తుంది.

అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమె కలిగిస్తుంది అని అంటారు. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. అన్నం ఎలా పుడుతుందనే విషయాన్నికూడా వేదం వివరించింది. దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి అని అంటారు. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని అంటారు.  

ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం. ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి  తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. ”హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి దద్ధోజనం, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చేయాలి. ఈరోజు అమ్మవారిని ‘అన్నపూర్ణ’ గా ఆరాధించిన వారికి సకల సంపదలు పొందుతారు..


మరింత సమాచారం తెలుసుకోండి: