సమస్త సృష్టికి మూలాధారమైన దుర్గా దేవిని పూజిస్తూ జరుగుతున్న శరన్నవరాత్రుల వేడుకలలో నేడు అమ్మవారిని లలిత త్రిపురసుందరి గా అలంకరించి ఆరాధిస్తారు. త్రిపురత్రయంలో రెండో శక్తి లలితా త్రిపుర సుందరి. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరీ స్వరూపం ఈ తల్లి. 

పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశాంకుశములను ధరించిన రూపంతో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి పూజలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. 

ఆ తల్లిని పూజించిన వారికి దారిద్య్ర దుఖాలను తొలిగించి సకల కార్య - ఐశ్వర్యాభీష్టాలను ఈమె సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీవిద్యా స్వరూపిణి, సృష్టి, స్థితి, లయకారిణి. కుంకుమతో నిత్యపూజలు చేసే సువాసినులకు (ముత్తైదువులకు) ఈ తల్లి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని అంటారు. 

శ్రీచక్రానికి కుంకుమార్చన లలితా అష్టోత్తరంతో ఈరోజు పూజించాలి. ”ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని పలు సార్లు జపిస్తే శుభం. ‘ప్రాత్ణస్మరామి లలితా వదనారవిందం - బింబాధరం పృధులమౌక్తిక శోభినామ్ - ఆకర్ణదీర్ఘ నయనం మణికుండలాఢ్యం - మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్’ అంటూ లలితా అమ్మవారిని ఈరోజు ఆరాధిస్తారు. 

ఈరోజు సింహాసనం మీద కూర్చుని కనిపించే అమ్మవారిని కొన్ని చోట్ల కాళికా దేవిగా కూడ ఆరాధిస్తారు. కొన్ని చోట్ల ఆరేళ్ళ బాలికను కాళీ గా పూజిస్తారు. కాళీ మాత పూజ శత్రు సంహారంగా భావించడం సహజం.. 
.


మరింత సమాచారం తెలుసుకోండి: